Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘కత్తి’ పట్టని పవన్

‘కత్తి’ పట్టని పవన్

కత్తి..తమిళనాట సంచలనాలు నమోదు చేసిన సినిమా. మురగదాస్ లాంటి దర్శకుడు..విజయ్ లాంటి హీరో మాత్రమే ఇందుకు కారణం కాదు. సినిమా సబ్జెక్ట్ కూడా. పచ్చటి పంటచేలను కాటేసే కార్పొరేట్ వ్యూహాలను ఎదిరించిన హీరో కథ ఆ సినిమా.  మరి అలాంటి సినిమా తెలుగులో చేసే అవకాశం వస్తే పవన్ ఎందుకు వద్దన్నాడు. ఏ హీరో అయినా మాంచి రెడీ మేడ్ హిట్ లైన్ దొరికితే చేజార్చుకునేందుకు అంగీకరించడు. మరి పవన్ ఎందుకు వదిలేసాడు..చేతిలో మరీ ఎక్కువ కమిట్ మెంట్ లు కూడా లేవు. 

గోపాల గోపాల పూర్తి కావచ్చింది.గబ్బర్ సింగ్ 2 అనేది టీవీ సీరియల్ లాంటిది..అది ఎప్పుడు మొదలవుతుందో, ఎవరు డైరక్ట్ చేస్తారో..ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికి తెలియదు. పివిపి సంస్థకు ఓ సినిమా చేయాల్సి వుంది. దానికి ఇంకా కథకమామిషు ఏమీ లేదు. అలాంటపుడు ఇలాంటి రెడీ మేడ్ ఆపర్ ను ఎందుకు వదిలేసినట్లు. పైగా ఠాగూర్ మధు మెగా ప్యామిలీకి దగ్గరవాడే.

దీనికి అసలు కారణం సినిమా లైన్ అని అంటున్నారు సినీ జనాలు. కత్తి సినిమా పచ్చటి భూములు, సెజ్ లు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యూహాల చుట్టు తిరుగుతుంది. మొన్నటికి మొన్న ఎన్నికల ముందు అయితే ‘ఏం రెండు బెడ్ రూమ్ లు చాలవా..అంత కావాలా..ఒక కారు చాలదా..నాలుగు కార్లు కావాలా.’ అంటూ సినిమా టిక్ డైలాగులు పేల్చారు. ఇప్పుడు ఈ సినిమాలో అంతకు మించిన పొలిటికల్ పంచ్ లు టపాసుల్లా పేలడానికి సిద్ధంగా వున్నాయి. ‘’ఏం రాజధానికి మూడువేల ఎకరాలు చాలవా..ముఫ్ఫైవేల ఎకరాలు కావాలా’.. ‘’రైతుల్ని కొట్టి రియల్ ఎస్టేట్ వాళ్లను మేపుతావా’’, ఇలాంటి డైలాగులు చాలా రాసుకోవచ్చు. 

కానీ అవన్నీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆయన తల పెట్టిన రియల్ రాజధాని వ్యవహారాన్ని ఇరుకున పడేసి, జనాలను చైతన్యం చేస్తుంది.  చంద్రబాబుకు, ఆయన పార్టీకి, ఆయన ప్రభుత్వానికి హోల్ సేల్ అంగరక్షకుడిగా నిల్చున్న పవన్ చేజేతులా అలాంటి పని ఎందుకు చేస్తాడు? అందుకే నో అని వుంటాడు అన్నది సినిమా వర్గాల లెక్క. మరి ఈ సినిమా ఇంకెవరు చేయాలి. మహేష్ కు కూడా ఆయన ‘బావ’బంధాలు ఆయనవి.

ఇక మిగిలిన సరైన జోడీ ఒక్కరే. మెగాస్టార్ చిరంజీవి,,రామ్ చరణ్. చిరంజీవి ఎలాగూ ప్రతిపక్షంలో వున్నారు. అందువల్ల సరైన సినిమా అవుతుంది ఆయనకు. ఎటొచ్చీ వయసు రీత్యా కాస్త మార్పులు చేసుకుంటే చాలు. కావాలంటే డబుల్ రోల్ మాని రామ్ చరణ్ ను తీసుకుంటే సరి. సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. మరి ఆయన దృష్టికి ఈ  విషయం రాకుండా వుండదు. అయినా ఆయనా జంకుతున్నారంటే, ఆయనకూ ఏవైనా బంధాలున్నాయేమో మరి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?