Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కట్టప్ప బాహుబలిని చంపింది ఇందుకే

కట్టప్ప బాహుబలిని చంపింది ఇందుకే

బాహుబలి 2 విడుదల ఏళ్లు, నెలలు, వారాల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. జనాలకు ఒకటే ఉత్కంఠ. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని. అసలు ఈ ఒక్క పాయింట్ నే సెకెండ్ పార్ట్ కు అత్యంత కీలకం అన్నది దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల అభిప్రాయం. చాలా తెలివిగా ఈ పాయింట్ ను జనాల్లోకి ఇంజెక్ట్ అయ్యేలా చేసారు.

ప్రతి ఒక్కరు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అని అడగడం, అదో పెద్ద బ్రహ్మరహస్యంలా తెలియదనడం అలవాటైపోయింది. 

ఇటీవల 'బాహుబలి 2 కథ ఇదేనా' అంటూ గ్రేట్ ఆంధ్ర' అందించిన కథనం వాస్తవమని బాహుబలి చూసిన వాళ్లు, ఆ నోటా ఈ నోటా వెల్లడించడంతో తెలుస్తోంది.

బాహుబలికి వ్యతిరేకంగా భల్లాలదేవ, అతని తండ్రి కలిసి శివగామికి నూరి పోయడంతో ఆమె కట్టప్పను ఆదేశించడం, అతగాడు బాహుబలిని చంపేయడం జరుగుతుందట. సినిమాలో ఇదేమంత ఎగ్జయిటింగ్ గా అనిపించదని తెలుస్తోంది. జస్ట్ సాదా సీదాగా అలా జరిగిపోతుందట. దీని కోసమేనా ఇన్నేళ్లు ఇంత హడావుడి చేసింది అని కూడా అనిపిస్తుందట. 

ఇక పోతే బాహుబలి 2 ఆద్యంత విజువల్ వండర్ అని మాత్రం అనిపించుకుంటుందట. స్కేల్, గ్రాండియర్ పార్ట్ వన్ కు డబుల్ రేంజ్ లో వున్నాయట. ఈసారి వాటిని హాలీవుడ్ స్టాండర్డ్ లోకి తీసుకెళ్లారట. 

అయితే బాహుబలి 2 స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు కూడా కథనం ప్రేక్షకుల ఊహకు అందని రేంజ్ లో మాత్రం వెళ్లదట. వాళ్ల ఊహకు ముందేం జరుగుతుంది అన్నది అందుతూనే వుంటుందట. అంతే కానీ ముందే జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే అంతగా వుండదని తెలుస్తోంది.అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్, కుంతల దేశ వ్యవహారాలు అన్నీ కూడా అలరిస్తాయిని తెలుస్తోంది.

ప్రభాస్ విగ్రహం హైలైట్

ఫస్ట్ పార్ట్ లో రానా (భల్లాల దేవ) విగ్రహం ఎత్తే సీన్ ఎలా అయితే హైలైట్ నో, సెకెండ్ పార్ట్ లో బాహుబలి (ప్రభాస్) విగ్రహం ఎత్తే సీన్ అంతకు మించిన హైలైట్ అంట. ఈ సీన్ మాత్రం సూపర్ గా పండిందని తెలుస్తోంది. ట్రయిలర్ లో జనాలు తలెత్తి అబ్బురంగా చూసే సీన్ ఇక్కడిదే అని వినికిడి. టోటల్ సినిమాకు హైలైట్ గా నిలిచే సీన్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?