Advertisement


Home > Movies - Movie Gossip
కేసీఆర్, నాగ్ భేటీ : కారణాలు మూడు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నాగార్జున కలిశారు. వీళ్ల భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని అంతా చెప్పుకున్నప్పటికీ ప్రధానంగా 3 రీజన్స్ వినిపిస్తున్నాయి. వీటిలో ఒకటి అక్కినేని జాతీయ అవార్డు. ఈ వీకెండ్ జరగనున్న ఈ అవార్డు ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రిని కలిశారు నాగార్జున.

2017 సంవత్సరానికి గాను అక్కినేని పురస్కారాన్ని దర్శకుడు రాజమౌళికి అందజేయనున్న విషయం తెలిసిందే. సీఎం కనుక తన అంగీకారాన్ని తెలిపితే, కేసీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంటారు రాజమౌళి. ఇక కేసీఆర్ ను కలవడానికి మరో రీజన్ కూడా ఉంది. 

వచ్చే నెలలో నాగ్ పెద్దకొడుకు నాగచైతన్య-సమంత పెళ్లి చేసుకోబోతున్నారు. గోవాలో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరగనున్న ఈ రిసెప్షన్ కు కేసీఆర్ ను ఆహ్వానించారట నాగార్జున. దీంతో పాటు డిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్ తిరిగొచ్చిన ముఖ్యమంత్రిని పరామర్శించే ఉద్దేశంతో కూడా కేసీఆర్ ను నాగార్జున కలిశారని తెలుస్తోంది. 

నాగచైతన్య-సమంత వెడ్డింగ్ రిసెప్షన్ కు డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే నెల 10న హైదరాబాద్ లో గ్రాండ్ గా ఈ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ ఏర్పాట్లను నాగార్జున దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యులైన సినీ, రాజకీయ ప్రముఖుల్ని తనే వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానాలు అందిస్తున్నారు.