Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కీరవాణి కోరిక తీర్చిన వర్మ!

కీరవాణి కోరిక తీర్చిన వర్మ!

ఏ కళాకారుడికి అయినా... తాను అన్ని రకాల కళారూపాలలో తన ప్రతిభను నిరూపించుకున్నప్పుడే పూర్తి సంతృప్తి ఉంటుంది. అలాగే కళాకారుడికి అంటరాని సబ్జెక్టు అంటూ ఉండదు. సాధారణంగా శుద్ధ కళావాదం నైతిక కళావాదం అంటూ రెండు రకాలు ఉంటాయి. ఒక పెయింటింగ్ ను తీసుకుంటే.. బూతు దృశ్యాన్ని పెయింటింగ్ గా మలిచారనుకోండి.. అది పెయింటింగ్ ప్రమాణాల దృష్ట్యా ఎంత అద్భుతంగా ఉన్నదో అనే సంగతిని మాత్రమే చర్చించేది శుద్ధ కళావాదం.

బూతుదృశ్యాన్ని ఇలా బహిరంగంగా అందరూ చూసే పెయింటింగ్ గా గీయడం తప్పు కదా.. అని వాదించేది నైతిక కళావాదం. కళాకారుల్లో రెండు రకాలూ ఉంటారు. శుద్ధకళావాదులు మాత్రం.. ముందు మనం చెప్పుకున్నట్లుగా తాము అన్ని రకాల కళారూపాలకు పనిచేస్తేనే సంతృప్తి అనుకుంటారు. అందుకు.. జాతీయ ఖ్యాతి ఉన్న తెలుగు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కూడా అతీతులు కాదు.

ఒకవైపు బాహుబలి వంటి అంతర్జాతీయ ఫేం కమర్షియల్ చిత్రానికి, అన్నమయ్య వంటి భక్తి రస ప్రధాన చిత్రానికి, యాక్షన్, సంగీతం, భావోద్వేగాలు, హాస్యం ... ఇలా అన్ని ఫార్మాట్ల చిత్రాలకు ఆయన సంగీతం అందించేశారు. ఇప్పుడు ఆయనకు చిరకాలంగా ఉన్న మరో కోరికను కూడా దర్శకుడు రాంగోపాల్ వర్మ తీర్చేశారు.

కీరవాణి.. తన సన్నిహితులతో ప్రెవేటు సంభాషణల్లో.. ఒక శృంగార రసప్రధానమైన (పోర్న్) చిత్రానికి కూడా సంగీతం సమకూర్చాలని ఉన్నదని అంటూండేవారట. కానీ.. ఆయనను మించిపోయి.. బృహత్ రూపం దాల్చిన ఆయన గౌరవ ప్రదమైన ఇమేజి ఆయనకు అలాంటి అవకాశాన్ని ఎన్నడూ దరిజేరనివ్వలేదు.

అయితే రాంగోపాల్ వర్మ ఆ ప్రయత్నం చేశారు. మియా మాల్కోవా.. అంతరంగం ఆవిష్కరణ అంటూ.. అటు షార్ట్ ఫిలిం కాకుండా, ఇటు సినిమాగా కాకుండా.. వర్మ ఆవిష్కరిస్తున్న బూతు చిత్ర రాజానికి... ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈనెల 26న ఈ చిత్రం మియా మాల్కోవా విమియో ఛానెల్ లో అధికారికంగా విడుదల అవుతుందని వర్మ ప్రకటించారు.

ఇప్పటికే ఆయన విడుదల చేసిన ట్రైలర్.. సంచలనం సృష్టిస్తోంది. శృంగార రసగుళిక లాంటి కన్నె, శృంగార రసోద్దీపనలను భావోద్వేగాలను... మరింత గాఢంగా తెలియజెప్పడంలో.. తన సంగీతపు మేళవింపు రుచి ఎలా ఉంటుందో కీరవాణి ఈ ట్రైలర్ లోనే తెలియజెప్పారు. ఆ రకంగా ఈ సెమీపోర్న్ చిత్రానికి సంగీతం అందించడం ద్వారా... కీరవాణికి చాలాకాలంగా ఉన్న తీరని కోరికను.. రాంగోపాల్ వర్మ తీర్చినట్లు అయిందని ఆయన సన్నిహితులు కొందరు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?