Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఖైదీ శాటిలైట్ కు వంద కోట్లా? వాటె కామెడీ?

ఖైదీ శాటిలైట్ కు వంద కోట్లా? వాటె కామెడీ?

బూస్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అని. టాలీవుడ్ సినిమాల పరిస్థితి అంతే. ఎంత గాలి కొడితే అంత హైప్. అప్పుడు బయ్యర్లను పడేయచ్చు.. లాభాలు మూటకట్టుకోవచ్చు. అదృష్టం బాగుండి సినిమా హిట్ అయితే ఓకె, లేదంటే నష్టాలు మూటకట్టుకోవమే. ఈ బూస్ట్, ఈ హైప్ చూసి చానెళ్లు కూడా పోటీపడి మరీ సినిమాలు కొనేస్తున్నాయి. 

కానీ ఇటీవల చానెళ్లకు కూడా డబ్బులు కిట్టుబాటు కావడం లేదు. బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్ సినిమాలు శాటిలైట్ ఫెయిల్యూర్స్ కు పెద్ద ఉదాహరణలు. అయినా కూడా శాటిలైట్ కోసం భారీగానే ఆపర్లు ఇస్తున్నాయి చానెళ్లు.  అయితే ఇలాంటి నేపథ్యంలో ఖైదీ నెంబర్ 150 సినిమాకు వంద కోట్ల శాటిలైట్ ఆఫర్ వచ్చిందటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

ఇది చదివితే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. సినిమా బిజినెస్ టర్నోవర్ అంతా కలిపి వంద కోట్లు వుండదు. పైగా బాహుబలికి కూడా అందులో పాతిక శాతం లేదు. మరి ఖైదీ 150కి వంద కోట్ల శాటిలైట్ ఆఫర్ అంటే ఏమనుకోవాలో? లేదా పది కోట్లు అనబోయి వంద కోట్లు అని రాయబోయి పొరపాటున ఓ సున్నా ఎక్కువ వేసి రాసారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?