Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొలిక్కి వచ్చిన కీరవాణి డిస్కషన్?

కొలిక్కి వచ్చిన కీరవాణి డిస్కషన్?

సైరా సినిమా సంగీత దర్శకుడు ఎవరు? ఈ ప్రశ్న గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. రెహమాన్ సీన్ నుంచి తప్పుకోవడంతో ఈ సమస్య వచ్చింది. మామూలుగా ఎవరు సంగీత దర్శకుడు అంటే ఎవరో ఒకర్ని తీసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు రెహమాన్ ప్లేస్ లో ఎవర్ని తీసుకోవాలి అన్నది సమస్య. ఆ పేరుకు దీటైన పేర ప్రాజెక్టు కు ఏడ్ అవ్వాలి. థమన్ వున్నాడు కానీ బాలీవుడ్ కు పరిచయం పెద్దగా వున్న పేరు కాదు. అందుకే కీరవాణి ఒక్కరే ఆప్షన్ గా మిగిలారు.

కీరవాణి అయితే దాదాపు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అందరికీ పరిచయం. పైగా బాహుబలి అన్న అతి పెద్ద ట్యాగ్ లైన్ వుండనే వుంది. కానీ సమస్య ఒక్కటే. ఆయనను హ్యాండిల్ చేసి, ఆయన దగ్గర నుంచి మంచి ట్యూన్ లు రప్పించుకోగలగడం.

నచ్చలేదు.. ఇంకొటి ట్రయ్ చేస్తారా? అన్న విషయాలు ఇలాంటి బడా బడా మ్యూజిక్ డైరక్టర్ల దగ్గర చెప్పడం కాస్త ఇబ్బంది కరంగా వుంటుంది. అది ఒక్కటే కాదు, ఇఫ్పుడు కీరవాణి రెమ్యూనిరేషన్ కూడా తక్కువేమీ వుండదు. సైరా లాంటి పెద్ద సినిమా అంటే కనీసం మూడుకోట్ల రేంజ్ లో వుంటుందేమో అన్న అనుమానం కూడా వుంది. 

ఈ మేరకు సిట్టింగ్ లు, డిస్కషన్లు జరిగినట్లు బోగట్టా. ఇప్పుడు అవన్నీ ఫైనల్ కు వచ్చేసాయని తెలుస్తోంది. రాజమౌళి ప్రమేయం కాస్త పని చేసిందని టాక్ వినిపిస్తోంది. కీరవాణి తన అంగీకారం తెలపడం ఆలస్యమని, ఇట్నుంచి అన్ని ప్రతిపాదనలు వెళ్లిపోయాయని తెలుస్తోంది.

ఆయన సై అంటే ఇక మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. ప్రస్తుతానికి కీరవాణి సవ్యసాచి సినిమాకు పని చేస్తున్నారు. సవ్యసాచి డైరక్టర్ చందు మొండేటికి రాజమౌళి ఫ్యామిలీ అంటే పిచ్చ ఫిదా. అందుకే ఆయనను మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు. ఇది కాక ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమా ఒకటి వుండనే వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?