Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కత్తిలాంటి కొణిదెల, దగ్గుబాటి కుర్రాళ్లు

కత్తిలాంటి కొణిదెల, దగ్గుబాటి కుర్రాళ్లు

వెనక బ్యాక్‌గ్రౌండ్‌ వుంటే, ఫాన్‌ బేస్‌ బలంగా వుంటే హీరోలుగా పరిచయం అయిపోయి కమర్షియల్‌ కథలని మాత్రమే నమ్ముకునే వారసులు చాలా మందిని చూసాం. అయితే ఈమధ్య కొందరు రొటీన్‌కి భిన్నంగా వెళుతూ కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. ముందే పెద్ద ఇమేజ్‌ కోసం పాకులాడకుండా కథలని నమ్ముకుంటూ ఇద్దరు యువ హీరోలు తమ స్థాయిని పెంచుకున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది.

వరుసపెట్టి అనుభవజ్ఞులైన దర్శకులతో పని చేసి, కథా విలువలు వున్న సినిమాలకి ప్రాధాన్యం ఇచ్చిన కొణిదెల వరుణ్‌ తేజ్‌ ఫాలో అయిన రూట్‌ ఫైనల్‌గా అతనికి కావాల్సిన విజయాన్ని కట్టబెట్టింది. ఫిదాతో పెద్ద బ్లాక్‌బస్టర్‌ కొట్టిన వరుణ్‌కి ఇప్పుడు క్లాస్‌ ఆడియన్స్‌లో, యూత్‌లో ఫాలోయింగ్‌ వచ్చింది. ఇలాగే మరో రెండు, మూడు సినిమాలతో మరింతగా వారికి దగ్గరైనట్టయితే ఇక వరుణ్‌ కెరీర్‌కి ఢోకా వుండదు.

అలాగే వెనక పెద్ద నిర్మాణ సంస్థ వున్నా, తమ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు చాలా మంది వున్నా కమర్షియల్‌ హీరో అయిపోవాలని చూడకుండా రానా దగ్గుబాటి ఛాలెంజింగ్‌ పాత్రలు చేసాడు. ఇతను కూడా అనుభవజ్ఞులైన దర్శకులనే నమ్ముకుని నెమ్మదిగా తన నటనకి పదును పెట్టుకున్నాడు. బాహుబలితో విలన్‌గా పేరు సాధించి, ఘాజీతో సినీ ప్రియుల అభిమానం పొంది ఇప్పుడు 'నేనే రాజు నేనే మంత్రి'తో స్టార్‌డమ్‌ దిశగా అడుగులు వేస్తున్నాడు. మూడు చిత్రాల మధ్య దీనికే ఆడియన్స్‌ ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇవ్వడాన్ని బట్టే రానా వెళ్లిన రూట్‌ రైట్‌ అని ప్రూవ్‌ అయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?