Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొణిదెల ఆఫీసులో హోమాలు

కొణిదెల ఆఫీసులో హోమాలు

మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా ఓపెనింగ్ జరిగిందంటూ ఫొటోలు బయటకు వచ్చాయి. దాంతో అందరూ ఈ రోజే చిరు సినిమా ఓపెనింగ్ అయిందంటూ ట్వీట్ లు చేసారు. వార్తలు రాస్తున్నారు. కానీ అసలు విషయం వేరు అని తెలుస్తోంది. అసలు చిరు సినిమా ఆగస్టు 22న ప్రకటించడం లేదా, లోగో వెల్లడించడం వంటివి వుంటాయని అందరూ ఊహించారు. కారణం చిరు బర్త్ డే కాబట్టి. కానీ జరిగింది వేరు.

శ్రావణమాసం వెళ్లిపోతోంది. భాద్రపదంలో మంచి ముహుర్తాలు వుండవు. అందుకే చకచకా ఓపెనింగ్ లు, ప్రకటనలు చేసేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు తెల్లవారు ఝామున నుంచీ పూజలు, హోమాలు, షురూ చేసారని వినికిడి.  ఆ వెంటనే చిరు సినిమా ఓపెనింగ్ చేసేసారని వినికిడి.

ఓపెనింగ్ కు ముందు చిరుకు, నిర్మాతగా చరణ్ కు అంతా మంచే జరగాలని కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీసులో కొన్ని హోమాలు, పూజులు కూడా జరిపించినట్లు తెలుస్తోంది. వీటిలో లక్ష్మీ గణపతి హోమం కూడా వుంది.

మరి పూజలు హోమాలు జరిపించి, అన్ని హడావుడులు చేసి, ఎవరికీ తెలియనివ్వలేదు ఎందుకనో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?