Advertisement


Home > Movies - Movie Gossip
'కోటేశ్వర్రావు' పై ఫిర్యాదు

పెద్ద సినిమాలు వచ్చాయంటే అడుగు అడుగు సంచలనమే. అజ్ఞాతవాసి సినిమా వ్యవహారం ఇలాగే వుంది. ఈ సినిమాలో పాపులర్ అయిన కొడకా కోటీశ్వర్రావా కరుసైపోతవు రో అనే పాటపై ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పడింది.

విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో కోటీశ్వర్రావు అనే న్యాయవాది ఫిర్యాదు చేసారు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన తల్లితండ్రులు పవిత్రమైన పరమేశ్వరుడి పేరును తన తల్లితండ్రులు పెట్టారని, ఇప్పుడు అందరూ కొడకా కొటీశ్వర్రావా అనేలా పరిస్థితి తయారైందని ఫిర్యాదుదారు అంటున్నారు. ఇది తన బాధ మాత్రమే కాదని, అనేకానేక మంది కోటీశ్వర్రావుల పరిస్థితి అని ఆయన అంటున్నారు.

తక్షణం ఆ పాటను సినిమాలోంచి తొలగించాలని, లేదా కనీసం ఆ పేరు మాత్రం తొలగించాలని అంటున్నారు. కొడకా కొటీశ్వర్రావు అనే బదులు, కొడకా చిరంజీవా, కొడకా అల్లుఅర్జునా, కొడకా త్రివిక్రమా అని ఎందుకు పాడలేదని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి భలే చిత్రమైన వివాదం ఇది.