Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్రిష్ ఆశలు గల్లంతు?

క్రిష్ ఆశలు గల్లంతు?

ఉన్నదీ పాయె..ఉంచుకున్నదీ పాయె..అని వెనకటికో సామెత వుంది. పాపం దర్శకుడు క్రిష్ వ్వవహారం అలా అయిపోయింది. గమ్యం, వేదం లాంటి మీడియం రేంజ్ సినిమాలు తీసుకోకుండా, ఒక్కసారి కృష్..ణం వందే జగద్గురుమ్ అంటూ భారీ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ వేళకు ఒక పక్క బాలీవుడ్ ఆశలు, మరో పక్క మహేష్ సినిమా లాంటి వ్యవహారాలు సజీవంగా వున్నాయి. 

ఒక్కసారి కృష్..ణం కుప్పకూలిపోగానే..అన్ని కలలు మెరుపుకలలుగా మిగిలిపోయాయి. ఇప్పటిదాకా మహేష్ ఏమన్నా అవకాశం ఇస్తాడేమో,..అని ఆశగా వున్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం,,అది కూడా హుష్ కాకి అయిపోయిందని వినికిడి. మహేష్ తన తరవాతి సినిమా అశ్వనీదత్ కోసం చేస్తాడని,, ఆయన పూరి లాంటి మాస్ దర్శకుడి కేసి చూస్తున్నాడని వార్తలు వినవస్తున్నాయి. అంటే క్రిష్ ఇక అన్ని ఆశలు వదిలేసుకుని, గమ్యంలా మళ్లీ చిన్న సినిమాతో తన కొత్త గమ్యం చూసుకుంటే బాగుంటుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?