Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కేటిఆర్ టార్గెట్ లోకేష్ నా? ‘దేశమా’

కేటిఆర్ టార్గెట్ లోకేష్ నా? ‘దేశమా’

ఉన్నట్లుండి తెలంగాణ నెంబర్ టూ అయిన కేటిఆర్ చేసిన కామెంట్ ఒకటి తెలుగుదేశం వర్గాలను ఆలోచింపచేస్తోంది. ఒకప్పుడు తనను నాన్ లోకల్ అని, తానే లోకల్ అని లోకేష్ అన్నాడని, ఇప్పుడు ఎవరు లోకల్ నో, నాన్ లోకల్ నో జనాలకే తెలుసని కేటిఆర్ కామెంట్ చేసారు. అక్కడతో ఆగకుండా లోకేష్ ఆంధ్రలో మంత్రి కావడంతో తెలంగాణలో తెలుగుదేశం పని ముగిసిపోయినట్లే అనే అర్థం వచ్చేలా కూడా కామెంట్ చేసారు.

అంటే నిన్న మొన్నటి దాకా, 2019 నాటికి లొకేష్ తెలంగాణను తన అడ్డా చేసుకునే అవకాశం వుందని కేటిఆర్ కావచ్చు లేదా రాజకీయ వర్గాలు కావచ్చు భావించినట్లు అనుకోవాలి. తండ్రి చంద్రబాబు ఆంధ్ర సిఎమ్ గా వుంటే తెలంగాణను తను తీసుకోవడానికి లోకేష్ ట్రయ్ చేస్తారన్న భావన లోలోపల వుండి వుండాలి. ఇక ఇప్పుడు లోకేష్ ఆంధ్రలో మంత్రి కావడం, అక్కడే దృష్టి సారించడం అంటే తెలంగాణపై ఆశలు వదిలేసినట్లే అనుకోవాలి అన్నది కేటీఆర్ కామెంట్లలోని భావం.

మరోపక్క ఇంకో మీనింగ్ కూడా వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. లోకేష్, చంద్రబాబు ఆంధ్రలో సెటిల్ అయిపోయారు. అందువల్ల ఇక తెలంగాణ తెలుగుదేశం పై అంత ఆసక్తి వుండదు కాబట్టి, మిగిలిన అడుగుబొడుగు దేశం జనాలు కూడా వీలైతే పార్టీలోకి వచ్చేయమని ఈ విధంగా పిలుపునిచ్చారన్నది ఆ టాక్ సారాంశం. ఇప్పటికే రేవంత్ రెడ్డి పైగా పార్టీ మారతారని, భాజపాలోకి వెళ్తారని గ్యాసిప్ లు వున్నాయి.

భాజపా నేరుగా తెరాసతో తలపడుతోంది. కాంగ్రెస్ దాదాపు పడుకున్నట్లే. అందువల్ల తెలుగుదేశాన్ని వీలయినంత పక్కకు తప్పించాలనే వ్యూహంతో ఇప్పుడు ఉన్నట్లుండి కేటిఆర్ ఈ వ్యాఖ్యలు చేసి వుంటారని తెలుస్తోంది. మొత్తం మీద లోకల్ నాన్ లోకల్ అంటూ కేటిఆర్ తెలుగుదేశం పార్టీని నాన్ లోకల్ గా ఫిక్స్ చేసేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?