Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'లైలా' భయపడుతోంది

'లైలా' భయపడుతోంది

అటు చూస్తే, పవర్ ఇటు చూస్తే ఆగడు..మధ్యలో లైలా కిందా మీదా అవుతోంది. పవర్ తో పెట్టకుంటే షాక్ కొడుతుందేమో..అటు ఆగడు కాస్తా ఆగనంటున్నాడు. పైగా 19కే వస్తాడని టాక్. ఇక మిగిలింది. 12వ తేదీ ఒక్కటే. ఈ రెండు సినిమాల మధ్యలో వారంలో కలెక్షన్లు ఎలా? 

పోనీ 19న ఆగడు వస్తే, 26కు వెళ్దాం అనుకుంటే నేనున్నాగా అంటూ గోవిందుడు..1వ తేదీకి రెడీ అయిపోతున్నాడు. ఇక మరెలా..అందుకే లైలా విడుదల సందిగ్ధంలో పడింది. సేఫ్ ప్రాజెక్టే, ప్రీ రిలీజ్ అంచనాలు కూడా బాగున్నాయి. కానీ టైమ్ చిక్కడం లేదు. పాపం ఇదే సమస్యో కానీ, నాగ్...చైతన్య సినిమాలన్నింటికీ ఇలాంటి సమస్య తరచు ఎదురవుతోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?