Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లంక సీన్లపైనే లవకుశ

లంక సీన్లపైనే లవకుశ

రామాయణం అంతా ఎంత ఆసక్తి కరమో, లంకా పట్టణం వ్యవహారాలు కూడా అంతే ఆసక్తికరం. జైలవకుశలో కూడా లంకా పట్టణం వుంటుంది. ఓ ఊరు ఊరంతా రావణుడి లాంటి జై గ్రిప్ లో వుంటుంది. అక్కడకు వెళ్లాలి లవ్ కుశ్ లు. వెళ్లి తమ పని చక్క బెట్టుకురావాలి.

ఇదే పూర్తిగా కీలకం ఆసక్తికరం అంట జై లవకుశ సినిమాలో. చివరి ఇరవై నిమిషాలు ఎన్టీఆర్ కెరీర్లో ది బెస్ట్ అనేటట్లు వుంటాయని తెలుస్తోంది. ఆ ఇరవై నిమిషాల పెర్ ఫార్మెన్స్ చేయడానికి మళ్లీ ఎన్టీఆర్ కు అలాంటి పాత్ర వస్తుందా అన్నది అనుమానం అన్న టాక్ వినిపిస్తోంది.

దీన్ని బట్టి చూస్తుంటే అందరూ ఊహిస్తున్నట్లు జైలవకుశ విషాదాంతమే అన్న అనుమానం కలుగుతోంది. సాధారణంగా గతంలో కూడా టాప్ హీరోలు మూడు పాత్రలు వేసినపుడు ఓ పాత్రను ఇలా ముగించడం అన్నది కామన్. బహుశా ఈ సినిమాలో కూడా అదే ఫార్ములా వాడి వుండొచ్చు.

ఇదిలా వుంటే గతంలో సినిమాలోని జనాలు అందరినీ ఓ ఇంట్లోకి చేర్చి కన్ఫ్యూజ్ కామెడీ క్రియేట్ చేయడం అనే ఫార్ములాను సక్సెస్ ఫుల్ గా తయారుచేసిన రచయిత కోన వెంకట్. ఈ సారి ఇంటికి బదులు, ఊరును తీసుకుని, అదే మ్యాజిక్ ను రిపీట్ చేసినట్లు కనిపిస్తోంది సెన్సారు రిపోర్టు వార్తలు వింటుంటే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?