Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లేట్‌గానే అయినా లేటెస్ట్‌గా వచ్చానంటోంది

లేట్‌గానే అయినా లేటెస్ట్‌గా వచ్చానంటోంది

చాలాకాలం  క్రిందట తెలుగులో ‘రెయిన్‌బో’ అనే సినిమా వచ్చింది. ‘హ్యాపీడేస్‌’ ఫేం రాహుల్‌ హీరోగా వచ్చిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది సోనాల్‌ చౌహన్‌. బాలీవుడ్‌లో ‘జన్నత్‌’, ‘3జి’ తదిత సినిమాల్లో నటించిన ఈ అందాల భామకి తెలుగులో ఆరేళ్ళ తర్వాత ‘లెజెండ్‌’ సినిమాతో పెద్ద బ్రేక్‌ లభించింది.  ప్రస్తుతం రామ్‌తో ‘పండగ చేస్కో’ సినిమాలో నటిస్తోందీ అందాల భామ.

కెరీర్‌లో ఇంత గ్యాప్‌ రావడానికి కారణం, తనకు నచ్చిన కథలు దొరక్కపోవడమేనని చెబుతోంది సోనాల్‌ చౌహన్‌. గ్లామరస్‌ పాత్రలతోపాటు, పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ సినిమాల్లో నటించాలనే ఆలోచనతోనే వచ్చిన అవకాశాల్ని కాదనుకున్నానని సోనాల్‌ చెబుతోంది.

‘లెజెండ్‌ తరహాలో ‘పండగ చేస్కో’ పెద్ద విజయం సాధిస్తుందనీ, ఈ సినిమాతో హీరోయిన్‌గా తన రేంజ్‌ పెరిగిపోతుందని సోనాల్‌ చౌహన్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. గత కొన్నాళ్ళుగా రామ్‌కి హిట్‌ సినిమా పడలేదు. మరోపక్క రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఆమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్‌.. అనే సెంటిమెంట్‌ బలపడిపోయింది. ఈ నేపథ్యంలో ‘పండగ చేస్కో’ సినిమా సోనాల్‌కి హిట్‌ ఇచ్చే అవకాశాలే ఎక్కువ. లేట్‌ అయినా లేటెస్ట్‌గా వచ్చానంటోన్న సోనాల్‌, ‘పండగచేస్కో’తో ఎలా సక్సెస్‌ పండగ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?