Home > Movies - Movie Gossip
లక్ష్మీ మంచు మరో థ్రిల్లర్

దొంగాట తరువాత మళ్లీ మంచి సినిమా పడలేదు మంచు లక్ష్మికి. లక్ష్మీ బాంబ్ పేలుతుంది అనుకున్నారు కానీ, సరైన టైమ్ కాకపోవడం, సరైన పబ్లిసిటీ లేకపోవడంతో వచ్చి,వెళ్లిన సంగతి కూడా ఎవరికీ తెలియదు. అందుకే ఈసారి మరో మాంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఫ్రయత్నం చేస్తోంది మంచు లక్ష్మి. బయట నిర్మాతలయితే సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని, పైగా సరైన సబ్జెక్ట్ దొరికిందని తానే నిర్మాతగా ఈసారి ప్రాజెక్టు చేయబోతోంది.

కొత్త దర్శకుడు తీసుకువచ్చిన అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ సబ్జెక్ట్ నచ్చడంతో ఈ నెలలో సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నారు. సినిమా కథ అంతా హీరోయిన్ ఓరియెంటెడ్ అని తెలుస్తోంది. అయితే సినిమా అన్నాక హీరో కూడా వుండాలి కదా? కథలో పార్ట్ గా వచ్చే హీరో క్యారెక్టర్ కోసం జ్యోతిలక్ష్మి సినిమాతో పరిచయం అయిన సత్య ను ఆప్షన్ గా చూస్తున్నట్లు తెలుస్తోంది. సత్య ఇప్పటికి చేసినవి కొద్ది సినిమాలే అయినా మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.