Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లయన్ లో ఎన్టీఆర్ పై సెటైర్లు?

లయన్ లో ఎన్టీఆర్ పై సెటైర్లు?

ఒకడు వచ్చి నేను పులీ అంటే కిందా పైనా మూసుకుని కూర్చోవాలి..అన్నది లయన్ ట్రయిలర్ లో ఓ డైలాగ్. ఇలాంటి డైలాగులు లయన్ సినిమాలో చాలా వున్నాయని టాక్. అయితే సినిమా అన్నాక డైలాగులు తప్పదు. కానీ అది కాదు విషయం. 

బాలయ్యకు ఎన్టీఆర్ కు మధ్య విబేధాలు వున్నాయని అంటారు. మొన్నటికి మొన్న అడియో ఫంక్షన్ లో పరోక్షంగా '....ఎమైందో తెలుసు కదా..' అంటూ ఓ డైలాగ్ వదిలారు. ఇలా ఎన్టీఆర్ కు పరోక్షంగా తగిలే ఒకటి రెండు డైలాగులు లయన్ లో వున్నాయని తెలుస్తోంది. 

అవి ఎలా వుంటాయి..ఎంతవరకు పేల్తాయి అన్నది ఒకటో తేదీన కానీ తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?