Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లౌక్యం ముందు గోవిందుడు వెలవెల

లౌక్యం ముందు గోవిందుడు వెలవెల

గోవిందుడు సినిమాకు ఎంత హైప్ తీసుకువద్దామని ప్రయత్నించినా, కలెక్షన్లు కుమ్మేస్తున్నాయని ప్రచారం చేసేందుకు ప్రయత్నించినా, ఆఖరికి అయిదు సెంటర్లలోనే యాభై రోజుల పోస్టర్ వేయించుకోగలిగింది. 

దానికన్నా ఓ వారం ముందు విడుదలై, గోవిందుడు బారిన పడి కొన్ని థియేటర్లలో లేచిపోయిన, గోపీచంద్ లౌక్యం మాత్రం 24 సెంటర్లలో డైరక్ట్ గా యాభై రోజుల పోస్టర్ వేసేసుకుంది. ఇటీవలి కాలంలో నిర్మాతకు మాంచి లాభాలు సంపాదించిపెట్టిన సినిమాల్లో ఇది ఒకటి. 

అందుకనే ఆ నిర్మాతలు గోపీచంద్ తోనే మరో సినిమా చేయాలనుకుంటున్నారట. నిజానికి గోవిందుడు కలెక్షన్లలో సగానికి పైగానే లౌక్యం కలెక్షన్లు వున్నాయి. కానీ రామ్ చరణ్ స్టార్ డమ్, దానికి జరిగిన ప్రచారం, నిర్మాణ వ్యయం అన్నీ కంపేర్ చేసుకుంటే లౌక్యం విజయం సాధించినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?