Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ముఖ్యమంత్రిగా మారిన మహేష్

ముఖ్యమంత్రిగా మారిన మహేష్

తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకొని యంగ్ పొలిటీషియన్ గా మహేష్ బాబు ఇప్పటికే దూకుడు సినిమాలో మెరిపించాడు. ఆ మూవీలో ఎమ్మెల్యేగా కొద్దిసేపు అలరించాడు. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయాడు మహేష్.

కొరటాల శివ, మహేష్ కాంబినేషన్ "భరత్ అనే నేను" సినిమా కొత్త షెడ్యూల్ నిన్నట్నుంచి ప్రారంభమైంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ముఖ్యమంత్రి గెటప్ లో మహేష్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్ బేగంపేటలో జరిగింది.

భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఆ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు దర్శకుడు. తాజాగా ప్రారంభమైన సెకెండ్ షెడ్యూల్ నుంచి మహేష్ జాయిన్ అయ్యాడు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత లండన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

స్పైడర్ సినిమాపై కొరటాల శివ సినిమా లండన్ షెడ్యూల్ ఆధారపడి ఉంది. స్పైడర్ టాకీ కంప్లీట్ అయినప్పటికీ.. 2 పాటల షూటింగ్ పెండింగ్ ఉంది. ఆ పాటల షూటింగ్ పై క్లారిటీ వచ్చిన తర్వాత కొరటాల సినిమాకు సంబంధించి లండన్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. "భరత్ అనే నేను" సినిమాలో మహేష్ సరసన కైరీ అద్వాణి హీరోయిన్ గా నటిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?