Home > Movies - Movie Gossip
మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇక స్టిల్సే స్టిల్స్

స్పైడర్ సినిమా స్టిల్స్ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కు కాస్త అసంతృప్తి వుంది. అది వాస్తవం. ఎందుకంటే సినిమాలో వైవిధ్యమైన గెటప్ లు లేదా డ్రెస్ లు వున్నాయో లేదో కానీ, ఇప్పటికి బయటకు వచ్చిన స్టిల్స్ అన్నీ జేమ్స్ బాండ్ టైపు స్టిల్సే. వీటిలో కూడా చాలా వరకు యాక్షన్ స్టిల్స్ నే.

అసలు ఎన్ని స్టిల్స్ వున్నాయి? అన్నది క్లియర్ పిక్చర్ లేదు. పైగా వున్నా వదలడానికి ఎవరికీ పవర్స్ లేవు. మురుగదాస్ ఓకె చేస్తే తప్ప ఒక్క స్టిల్ కూడా బయటకు వచ్చే అవకాశమూ లేదు. అందుకే సినిమాకు లో బజ్ వున్నా ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.

ఇదిలా వుంటే సినిమా పబ్లిసిటీకి మరిన్ని మహేష్ బాబు స్టిల్స్ అవసరం అన్న విషయాన్ని దర్శకుడు మురుగదాస్ కూడా గుర్తించినట్లుంది. అందుకే గడచిన రెండు రోజుల్లో అర్జెంట్ గా చెన్నయ్ లో మహేష్ బాబు అందుబాటులో వుండడంతో ఫోటోషూట్ చేయించేసారు.

భంగిమ వన్.. టూ అంటూ రకరకాల స్టిల్స్ తీయించేసారు. అదే టైమ్ లో హీరోయిన్ రకుల్ కు కూడా స్టిల్స్ తీయించాలనుకున్నా కుదరలేదు. ఎందుకంటే ఆమె వేరే పనిపై ఢిల్లీలో వుండడమే కారణంగా తెలుస్తోంది.

సో ఇంక ఈ స్టిల్స్ అన్నీ బయటకు వస్తే మహేష్ ఫ్యాన్స్ కు పండగే పండగ.