Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్‌బాబు పెద్ద రోగ్‌!

మహేష్‌బాబు పెద్ద రోగ్‌!

మహేష్‌ని అంత మాటనేసింది ఎవరని కంగారు పడకండి. మహేష్‌ సినిమా కోసం పూరి జగన్నాథ్‌ ఫిక్స్‌ చేసుకున్న టైటిల్‌ ఇదట. ఇడియట్‌, పోకిరిలాంటి టైటిల్స్‌తో సినిమాలు తీసిన పూరి జగన్నాథ్‌ ఇప్పుడు ‘రోగ్‌’ అనే పదానికి కూడా హీరో ఎలివేషన్‌ ఇవ్వనున్నాడు. 

మహేష్‌తో పూరి జగన్నాథ్‌ సినిమా ఉంటుందనేది ఖరారైపోయింది. కొరటాల శివ చిత్రం ఎప్పుడు పూర్తయితే అప్పుడు వెంటనే పూరి చిత్రాన్ని స్టార్ట్‌ చేస్తారు. పూరి తనదైన శైలిలో నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేసి, విడుదల చేసేస్తానని అంటున్నాడు. 

పూరి జగన్నాథ్‌ ఫ్లాపుల్లో ఉన్నప్పుడే తనతో పోకిరి, బిజినెస్‌మేన్‌ తీసాడు కాబట్టి అతని ప్రెజెంట్‌ ఫామ్‌ గురించి మహేష్‌ వర్రీ అవడం లేదు. మహేష్‌తో సినిమా అనగానే పూనకం వచ్చినట్టు డైలాగులు రాసేసే పూరి జగన్నాథ్‌ రోగ్‌ కోసం కూడా అదిరిపోయే స్క్రిప్ట్‌ సిద్ధం చేసాడట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?