Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ సినిమాకు పాతిక కోట్ల శాటిలైట్?

మహేష్ సినిమాకు పాతిక కోట్ల శాటిలైట్?

ఈ మధ్య కాలంలో సినిమాల బడ్జెట్ లు వందకోట్లు దాటేస్తున్నాయి. అమ్మకాలు అలాగే వున్నాయి. దీనికితోడు ఇటీవల పెద్ద సినిమాల శాటిలైట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఆ మధ్య వరకు పెద్ద హీరోల సినిమాల శాటిలైట్ రేటు 15 నుంచి 16 కోట్లు పలికేది. ఇప్పుడు అది ఇరవై కోట్లకు చేరిపోయింది.

లేటెస్ట్ బజ్ ఏమిటంటే కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా శాటిలైట్ బేరాలు మొదలయ్యాయి. నిర్మాత దానయ్య 25 కోట్లకు రేటు కోట్ చేస్తున్నారు. చానెళ్ల జనాలు 20 కోట్ల దాకా వచ్చారట. కానీ నిర్మాత ఇంకా తన రేటు మీదే వున్నారని తెలుస్తోంది.

కనీసం 20కి 25కి మధ్య సెటిల్ అవుతుందని, అదీ కూడా ఒకటి రెండు రోజుల్లో ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. ఓ సినిమాకు ఇరవై కోట్ల మేరకు శాటిలైట్ అంటే ఓ మీడియం రేంజ్ హీరో భారీ సినిమా టోటల్ బడ్జెట్ కింద లెక్క. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?