Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్‌ డైరెక్టర్‌కి చిర్రెత్తింది

మహేష్‌ డైరెక్టర్‌కి చిర్రెత్తింది

‘మిర్చి’లాంటి బ్లాక్‌బస్టర్‌ తీసిన డైరెక్టర్‌ కొరటాల శివ తన రెండో సినిమా స్టార్ట్‌ చేయడానికి చాలా టైమ్‌ వెయిట్‌ చేయాల్సి వచ్చింది. అయితే రెండో సినిమా మహేష్‌బాబుతో సెట్‌ అవడంతో శివ హ్యాపీగా ఉన్నాడు. సూపర్‌స్టార్‌తో సూపర్‌హిట్‌ ఇవ్వాలని కష్టపడుతున్నాడు. అయితే అతడిని పని మీద ఫోకస్‌ చేయనివ్వకుండా మీడియా ఎప్పటికప్పుడు అడ్డు తగులుతోంది. 

ఈ చిత్రంపై వారానికో గాసిప్‌ పుట్టుకు వస్తూ ఉంటే వాటికి కొరటాల శివ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత కూడా దీనికి బ్రేక్స్‌ పడిపోయాయనే రూమర్స్‌ రావడం అతడిని ఇరిటేట్‌ చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న శృతిహాసన్‌ వేరే తమిళ సినిమా కోసం దీనిని వదిలేసుకుందనే పుకారు కొరటాల శివకి చిర్రెత్తించింది. 

ఇలాంటి రూమర్స్‌ ఎలా పుడుతున్నాయంటూ తన ఇరిటేషన్‌ని ఎక్స్‌ప్రెస్‌ చేసాడు. శృతిహాసన్‌ ఈ చిత్రంలో నటిస్తోందని, ఆమె వెళ్లిపోవడం కానీ, రీప్లేస్‌ చేయడం కానీ జరగలేదని తేల్చేసాడు. దీనికి తెర పడిపోయింది కనుక ఈ చిత్రంపై వచ్చే నెక్స్‌ట్‌ రూమర్‌ ఏంటో మరి? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?