Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ డౌన్..ఎన్టీఆర్ అప్

మహేష్ డౌన్..ఎన్టీఆర్ అప్

ప్లానింగ్ లు ఒకలా వుండవు. టైమ్ కలిసి రావాలి. కొన్నాళ్ల క్రితం వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లానింగ్ అదుర్స్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎన్టీఆర్ ప్లానింగ్ అదుర్స్ అనిపిస్తోంది. రెండు ప్రాజెక్టులు మహేష్ బాబు ప్లానింగ్ ను తల్లకిందులు చేసేసాయి. శ్రీమంతుడు తరువాత మహేష్ టాప్ లీగ్ లోకి వెళ్లిపోయాడు అనుకుంటే బ్రహ్మోత్సవం దారుణంగా దెబ్బ తీసింది.

ఆ తరువాత మురుగదాస్ సినిమా ఇదిగో అదిగో అంటూ చెక్కుతున్నారు. దీంతో లైన్ అప్ మొత్తం పోయింది. కొరటాల శివ సినిమా ప్రారంభమైంది. అది ఒక్కటే ఆశ. ఆపై వంశీ పైడిపల్లి సినిమా చేయాలి. ఆ తరువాత వీలయితే త్రివిక్రమ్ సినిమా. అంతే. కానీ గ్యారంటీ లేదు.

కానీ ఎన్టీఆర్ వ్యవహారం వేరుగా వుంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు ఖాతాలో క్రెడిట్ సైడ్ వేసేసుకున్నాడు. బాబీతో సినిమా చేస్తూనే, త్రివిక్రమ్ సినిమా ఖరారు చేసుకున్నాడు. ఆ తరువాత కొరటాల శివ సినిమాకు అగ్రిమెంట్లు కుదిర్చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆ తరువాతి సినిమా కోసం కూడా తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించిన రాజమౌళితొ మరో సినిమా చేయాలని ఎన్టీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ నే. వాళ్లిద్దరి మధ్య అనుబంధం అలాంటిది.. అందుకే తనతో సినిమా చేయమని ఎన్టీఆర్ నే స్వయంగా రాజమౌళిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ కోసం డైరక్టర్లను సెట్ చేసుకోవడం అన్నది ఎన్టీఆర్ పాజిటివ్ పాయింట్. జనతా గ్యారేజ్ అలాగే సెట్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ ను అలాగే ఒప్పించాడు. కొరటాల శివతో మళ్లీ మరో సినిమా ఓకె చేయించుకోగలిగాడు. ఇప్పుడు రాజమౌళి తొ కూడా ఓకె అనిపించుకోగలిగితే, టాలీవుడ్ టాప్ ప్లాన్డ్ హీరో ఎన్టీఆర్ నే అవుతాడు.

ఇలా సినిమాలు ప్లాన్ చేసుకోవడంలో అందరికన్నా కిందన వున్నది రామ్ చరణ్ నే. అదేంటీ? ఎందుకు ? అన్నది ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. సినిమాల ప్లానింగ్, స్పీడ్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది.

ప్లానింగ్ విషయానికి వస్తే, బన్నీ కూడా బాగానే ప్లాన్ చేస్తాడు కానీ, డైరక్టర్లు దొరకడం లేదు. సరైనొడు తరువాత సరైన డైరక్టర్ దొరకలేదు. ఆఖరికి హరీష్ శంకర్ కు ఫిక్స్ అయ్యాడు. దీని తరువాత కూడా పెద్ద డైరక్టర్లు సెట్ కాలేదు. వక్కంతం వంశీకి అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత అయినా పెద్ద డైరక్టర్లు ఎవరైనా లైన్ లో వున్నారా? అంటే అదీ లేదు. లింగుస్వామి లాంటి వాళ్లు మాత్రం వెయింటింగ్ లిస్ట్ లో వున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?