Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ఫ్యాన్స్ కూడా జాయిన్ అయ్యారా?

మహేష్ ఫ్యాన్స్ కూడా జాయిన్ అయ్యారా?

కాటమరాయుడు సినిమాపై నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అవుతోందని, యూట్యూబ్ లో ట్రయిలర్ కు డిస్ లైక్ లు తప్పవని ముందుగానే వార్తలు బయటకు వచ్చేసాయి. అయితే ఇదంతా బన్నీ క్యాంప్ పుణ్యమా అని అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఎందుకంటే బన్నీ డిజె సినిమా టీజర్ కు పవన్ ఫ్యాన్స్ కొట్టిన డిస్ లైక్ లు ఇంకా యూట్యూబ్ లో కళ్ల ముందే వున్నాయి.

ఇప్పుడు టైమ్ వచ్చింది బన్నీ ఫ్యాన్స్ అదే కార్యక్రమం స్టార్ట్ చేసారు. 24 గంటలు కాకుండానే 43వేల డిస్ లైక్ లు వచ్చేసాయి. అయితే ఇది కేవలం బన్నీ ఫ్యాన్స్ పుణ్యం కాదట. మహేష్ ఫ్యాన్స్ కూడా యధాశక్తి పాలు పంచుకుంటున్నారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. కాటమరాయుడు ట్రయిలర్ బయటకు రావడానికి ఒకటి రెండు రోజుల ముందే మహేష్ ఫ్యాన్స్ పేరిట, ట్విట్టర్ లో ఈ మేరకు వాళ్లని ఈ డిస్ లైక్ ల దిశగా మోటివేట్ చేసే పని ప్రారంభమయిందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ డిజ్ లైక్ ల కన్నా లైక్ లే మూడురెట్లు వున్నాయి అనుకోండి.  కానీ ఈ డిజ్ లైక్ లు కూడా తక్కువేమీ కాదు. ఇక్కడితో ఆగుతుందనీ లేదు. పవన్ కు పోటీగా చాలా మంది హీరోలు వున్నారు. మరి వాళ్లంతా కూడా తలా చేయివేసి, తలా డిజ్ లైక్ కొడితే పరిస్థితి వేరుగా వుంటుంది. కానీ ఈ మొత్తం డిస్ లైక్ ల వ్వవహారం అంతా తమ హీరో బన్నీ ఖాతాలనే పడుతోందని అతగాడి ఫ్యాన్స్ కొంత మంది ఫీలవుతున్నారట.

ఏమిటో ఈ ఫ్యాన్స్. ఒకప్పుడు ప్రత్యర్థి సినిమాల ఫోస్టర్లపై పేడ కొట్టేవారు. ఇప్పుడు యూట్యూబ్ లో డిజ్ లైక్ లు కొడుతున్నారు. దేనికీ పెద్దగా తేడా కనిపించడంలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?