Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేశ్ ఫ్యాన్స్ హ్యాపీ: ప్రిన్స్ బ్రాండ్ ఇండియాలోనే టాప్!

మహేశ్ ఫ్యాన్స్ హ్యాపీ: ప్రిన్స్ బ్రాండ్ ఇండియాలోనే టాప్!

సినిమా హీరోలు- వారు కనిపించే ఎండార్స్ మెంట్లు కూడా ఇప్పుడు చర్చనీయాంశాలే. నిన్న మొన్నటి వరకూ ఆమిర్ ఖాన్ ఎండార్స్ చేస్తున్న వాటి గురించి ఆసక్తికరమైన చర్చనే చూశాం. హీరోలపై అభిమానాన్ని వారు అంబాసిడర్ గా వ్యవహరించే వాటిపై కూడా చూపుతూ ఉంటారు ఫ్యాన్స్. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు మహేశ్ అభిమానులకు ఇదొక ఆనందకరమైన సందర్భం. ఎలాగంటే.. ఇప్పుడు మహేశ్ బాబు ఎండార్స్ చేస్తున్న ఒక మొబైల్ కంపెనీ ఇండియాలోనే టాప్ ప్లేస్ లో నిలిచిందట.

ఈ దేశీయ మొబైల్ కంపెనీ.. దేశీయంగా నంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. మరి మన హీరోలు ఎండార్స్ మెంట్ లో కనిపించడం ఆయా హీరోల అభిమానులకు ఆనందకరమైన విషయం కాబట్టి.. ఇప్పుడు మహేశ్ ఎండార్స్ చేస్తున్న సంస్థ టాప్ పొజిషన్ లో నిలవడం ఆ హీరో అభిమానులను సంతోష పెట్టేదే. 

ఇప్పటికే మహేశ్ ఫ్యాన్స్ ఈ విషయంలో బోలెడంత గర్వాన్ని కలిగి ఉన్నారు. మహేశ్ కొన్ని హిందీ యాడ్స్ లో కూడా కనిపించడం..  కొన్ని సంస్థలకు దేశామంతటికీ మహేశే అంబాసిడర్ గా ఉండటం వంటి రీజన్లతో ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు మహేశ్ ఎండార్స్ చేస్తున్న ఇండియా బ్రాండ్ ఇండియాలో టాప్ గా నిలవడం ఆ హీరో అభిమానులను నిస్సందేహంగా గర్వించేలా చేస్తుంది!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?