Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్-మందుగ్లాస్?

మహేష్-మందుగ్లాస్?

రాముడు మంచి బాలుడు అన్నట్లు కనిపిపిస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ పాపం, అలాంటి హీరో ఫోటో ఒకటి ఈరోజు సాక్షి మీడియాలో ఫ్రత్యక్షమై కాస్త కలకలం రేపుతోంది.

విదేశాల్లోని జూదశాలలో అది కూడా మందు గ్లాస్ గేమ్ టేబుల్ పై వుండగా మహేష్ బాబు సీరియస్ గా ఆటాడేస్తున్న ఫోటో అది.

మైత్రీ మూవీస్ నిర్మాతలు మహేష్ ఫ్యామిలీకి శ్రీమంతుడు సినిమా నుంచి బాగా దగ్గరయిపోయారు. సినిమా నిర్మాణంతో సంబంధం లేకుండా వారు ఇప్పుడు అన్నివిధాలా మహేష్ ఫ్యామిలీకి సలహాలు, సూచనలు ఇవ్వడం, పనులుు చక్క బెట్టడం వంటివి చేస్తున్నారన్న గుసగుసలు వున్నాయి. ఇప్పుడు వారితోనే అమెరికాలో మహేష్ ఫ్యామిలీ టూర్ సాగుతోంది.

ఈ టూర్ విశేషాల వార్తను ప్రచురిస్తూ సాక్షి పత్రిక మహేష్ కాసినోలో వున్న ఫొటో ప్రచురించింది. 

మందుగ్లాసు వుండడం తప్పుకాదు. మందు అన్నది ఇవ్వాళ, రేపు మంచి నీళ్లలా కామన్ వ్యవహారం. కాసినో అన్నది కూడా అంతకన్నా కామన్. అయితే హీరో అనేసరికి పబ్లిక్ గా కాస్త జాగ్రత్తగా వుంటారు.

ఆ మధ్య హీరో బాలకృష్ణ ఓ హీరోయిన్ తో ముచ్చటిస్తున్నపుడు పక్కన మందుసీసా పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే బాలయ్య వ్యవహారం తెలిసినవారు, ఆయన దేనినీ లెక్కచేయరు.

ఆయన అనుకున్నది చేస్తారు అని లైట్ తీసుకున్నారు. కానీ ఇఫ్పుడు మహేష్ ఫోటో చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?