Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

3 రోజుల ముందే ముగిసిన మహేష్ బాబు షూటింగ్

3 రోజుల ముందే ముగిసిన మహేష్ బాబు షూటింగ్

కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు మహేష్. లెక్కప్రకారం ఈ మూవీ షెడ్యూల్ మంగళవారం వరకు జరగాలి. కానీ నిన్నటితోనే ఈ సినిమా షెడ్యూల్ ను ముగించారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. లక్నోలో మహేష్ బాబు షూటింగ్ సక్సెస్ ఫుల్ గా జరిగిందంటూ ప్రకటించారు.

కానీ కొన్ని అనుమతులు దొరక్కపోవడంతోనే సినిమా షూటింగ్ ను అనుకున్న డేట్ కంటే 3రోజుల ముందు ముగించినట్టు తెలుస్తోంది. లక్నోలోని కొన్ని పురాతన కట్టడాలు, చారిత్రక ప్రదేశాల వద్ద షూటింగ్ ప్లాన్ చేశారు. ఆ ప్రాంతాల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీయాలనుకున్నారట. అందుకే పురాతత్వ శాఖ నుంచి షూటింగ్ కు అనుమతులు రాలేదని తెలుస్తోంది.

మరోవైపు రొమేనియా వెళ్లడానికి రెడీ అవుతున్నాడు మహేష్. వచ్చే వారమే స్పైడర్ యూనిట్ తో కలిసి రొమేనియా వెళ్తాడు. సినిమాకు సంబంధించి మిగిలిన ఒక్క పాటను పూర్తిచేయబోతున్నాడు.  ఫారిన్ టూర్ కు ముందు 2రోజులు రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే కొరటాల సినిమా షూటింగ్ ను కాస్త ముందే ముగించారనే వాదన కూడా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?