Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్ ఆప్షన్ ఓపెన్ అంట

మహేష్ ఆప్షన్ ఓపెన్ అంట

మురగదాస్ నా..త్రివిక్రమ్ నా.. లేదా మళ్లీ పూరి లైన్లోకి వస్తాడా.. శేఖర్ కమ్ముల చాన్స్ అందుకుంటాడా? అంటే ఇక్కడ మహేష్ స్ట్రాటజీ ఒక్కటేనంట..బ్రహ్మోత్సవం పూర్తి అయిపోయేనాటికి ఎవరు పూర్తి స్క్రిప్ట్ తో, అది కూడా తనకు నప్పే, నచ్చే స్క్రిప్ట్ తో వస్తే వాళ్లకే చాన్స్ అంట. 

అంతే కానీ, బ్రహ్మోత్సవం తరువాత ఈ సినిమానే, ఈ డైరక్టర్ కే చేస్తాను అని మహేష్ ఏమీ ఫిక్సయిపోలేదంట. బ్యాక్ టు బ్యాక్ పెద్దగా గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలన్నదే అయిడియా. శ్రీమంతుడు పూర్తయ్యే సరికి బ్రహ్మోత్సవం సెట్ మీదకు వెళ్లినట్లు, అది పూర్తి కాగానే కొత్త సినిమా సెట్ మీదకు వెళ్లాలన్నది మహేష్ అయిడియా. దీనికి కావాల్సింది మంచి అదిరిపోయే స్క్రిప్ట్.. అది కూడా రెడీగా వుండాలి. 

అది త్రివిక్రమ్ కావచ్చు..మురగదాస్ కావచ్చు..మరెవరైనా కావచ్చు. ఒక విధంగా ఈ స్ట్రాటజీ ఏదో బాగానే వుంది. ఏదో డైరక్టర్ కు మాట ఇచ్చా అని చెప్పి, అతగాడు స్క్రిప్ట్ రెడీ చేసేదాకా టైమ్ వేస్ట్ చేసే కన్నా, మల్టిపుల్ చాయిస్ అన్నది మంచిదే కదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?