Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టీజర్ లో ఉన్నది సినిమాలో కనిపించదట

టీజర్ లో ఉన్నది సినిమాలో కనిపించదట

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్పైడర్ ఫస్ట్ లుక్ విడుదలకానుంది. ఈ విషయాన్ని మహేష్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. ఈ టీజర్ పై ఎప్పట్నుంచో భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే కేవలం టీజర్ కోసమే దర్శకుడు మురుగదాస్ ప్రత్యేకంగా షూటింగ్ కూడా చేశాడు. సో.. స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతోందనే విషయం పక్కా. అయితే సినిమాకు టీజర్ కు ఎలాంటి సంబంధం ఉండదని తెలుస్తోంది. 

సాధారణంగా అప్పటివరకు షూట్ చేసిన సన్నివేశాల్లోంచి టీజర్ ను కట్ చేస్తారు. ఆ ఫ్రేమ్స్ సినిమాలో కూడా కనిపిస్తాయి. కానీ స్పైడర్ టీజర్ లో కనిపించిన సీన్స్ ఏవీ సినిమాలో ఉండవట. దేనికదే సెపరేట్ అని టాక్. టీజర్ చూసి సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని ఆడియన్స్ గెస్ చేయలేరట. అటు మహేష్ క్యారెక్టర్ కూడా ఏంటనే విషయం టీజర్ చూస్తే తెలియదట. 

కేవలం మహేష్ ను సరికొత్తగా చూపించడంపైనే దృష్టిపెడుతూ టీజర్ ను కట్ చేశారని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ చివర్లో స్పైడర్ సినిమా థియేటర్లలోకి రానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?