Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంతపని చేయకు మహేష్

 అంతపని చేయకు మహేష్

మహేష్ సై అంటే అతడితో సినిమాలు చేసేందుకు స్టార్ డైరక్టర్లు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కానీ మహేష్ మాత్రం జయంత్ కు ఓ స్టోరీ రెడీ చేయమని చెప్పాడట. అది కూడా ప్యూర్ లవ్ స్టోరీ అయి ఉండాలట. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడట జయంత్. ఈ విషయాల్ని దర్శకుడు జయంత్ స్వయంగా వెల్లడించేసరికి, మహేష్ అభిమానుల గుండెల్లో రాయిపడింది. 

మహేష్-జయంత్ సి పరాన్జీ కాంబోలో వచ్చిన టక్కరిదొంగ సినిమాను ఎవరూ మరిచిపోలేరు. ఈ మూవీ డిజాస్టర్ తర్వాత మళ్లీ జయంత్ తో కలిసి సినిమా చేయలేదు మహేష్. అయితే ఈ దర్శకుడు మాత్రం మహేష్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటున్నాడట. అలా కొన్ని స్టోరీలైన్స్ కూడా వినిపించాడట. కానీ మహేష్ మాత్రం తనతో ఓ లవ్ స్టోరీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని జయంత్ ప్రకటించాడు. 

ఈ దర్శకుడు ఇప్పటోడు కాడు. 1997 నుంచి ఫీల్డ్ లో ఉన్నాడు. స్టార్టింగ్ లో మంచి హిట్స్ ఇచ్చాడు కానీ పుష్కర కాలంగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడు. అలాంటి దర్శకుడికి మహేష్ మళ్లీ అవకాశం ఇస్తాడని ఎవరూ అనుకోరు. ఒకవేళ ఇచ్చినా అది సెట్స్ పైకి రావడానికి చాలా టైం పడుతుంది. 

మురుగదాస్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత కొరటాల శివ సినిమా చేయాలి. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంకో సినిమా. ఇలా చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి మహేష్ ఖాతాలో. సో.. మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనిలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?