Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ ఓవర్ సీస్ పండగ దీనికేనా?

మళ్లీ ఓవర్ సీస్ పండగ దీనికేనా?

శ్రీమంతుడు.. భలే భలే మగాడివోయ్.. నాన్నకు ప్రేమతో.. ఓవర్ సీస్ మార్కెట్ స్పీడ్ ను పెంచిన సినిమాలు. ఇప్పుడు మళ్లీ నాని సినిమా మీదే అలాంటి ఆశలు కనిపిస్తున్నాయి. సినిమా ట్రయిలర్ చూస్తుంటే ఓవర్ సీస్ జనాలకు నచ్చే జోనర్ లోనే వున్నట్లు అనిపిస్తోంది. నాని స్టయిల్ ఆఫ్ నటన, ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి ఓవర్ సీస్ జనాలకు నచ్చుతుందని భావిస్తున్నారు. 

ఓవర్ సీస్ లో ఈ సినిమాను అమ్మలేదు. 14 రీల్స్ సంస్థ నేరుగా పంపిణీ చేసుకుంటోంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇప్పట్లో మళ్లీ ఓవర్ సీస్ జనాలకు కావాల్సిన సినిమా లు ఒకటి రెండు కనిపిస్తున్నాయి. 19న సునీల్ కృష్ణాష్టమి వుంది. ఇది ఓవర్ సీస్ లొకేషన్లలో ప్రారంభమై, ఇండియాకు షిప్ట్ అయ్యే కథ. కానీ ఇందులో కొంచెం మాస్ ఎలిమెంట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

అందువల్ల ఓవర్ సీస్ జనాలు ఏలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మంచు మనోజ్  శౌర్య ట్రయిలర్ కూడా ప్రామిసింగ్ గానే వుంది. దర్శకుడు దశరథ తన స్టయిల్ క్లాస్ టేకింగ్ కు, కాస్త థ్రిల్లర్ ఎలిమెంట్లు జోడించినట్లుంది. ఈ రెండు దాటితే మళ్లీ ఏప్రిల్ లో పెద్ద సినిమాలు వస్తే కానీ ఓవర్ సీస్ లో బాక్సాఫీసు కళకళలాడదు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?