Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మంచు వారి హీరోయిన్ 'వేశ్య'?

మంచు వారి హీరోయిన్ 'వేశ్య'?

మంచువారి హీరోయిన్ వేశ్య అని కాదండోయ్..వేశ్య పాత్ర వేస్తోందని. మంచువారి కుర్రాడు మనోజ్ తో పోటుగాడులో వేసిన  సోనాక్షి చౌద‌రి ఇప్పుడు వేశ్య పాత్ర పోషిస్తోంది. పోటుగాడు సినిమా హడావుడి ఎక్కువ, అసలు తక్కువ అయిపోయినా, కాస్త పేరు తెచ్చుకుంది సోనాక్షి చౌదరి. అయినా టాలీవుడ్ కాదు పొమ్మంది.

కానీ బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్ వచ్చింది. జూలీ సీక్వెల్‌లో వేశ్య పాత్ర ద‌క్కింది. ఆ సినిమా పార్ట్ వన్ లో నేహా ధూపియా విచ్చల విడిగా అందాలు ఆర‌బోసిసి, తన కెరీర్ కు లైన్ క్లియర్ చేసుకుంది. అలాంటి అవ‌కాశం సోనాక్షి ని వరించింది.  మే నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమాకు శివదాసాని దర్శకుడు. 

వేశ్య పాత్ర అంటే మళ్లీ అల్లాటప్పాగా వుండదట. కుర్రకారు జనాల్ని వేడెక్కించే సీన్లు, మూతి మూతి రాపాడించుకునే సన్నివేశాలు కాస్త పుష్కలంగానే వుంటాయట. వెయిట్ అండ్ సీ. అయినా చేయడానికి సోనాక్షికి అభ్యంతరం లేనపుడు, చూడ్డానికి మనకెందుకు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?