Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'మంచు' వివాహ భోజనంబు?

'మంచు' వివాహ భోజనంబు?

మాయాబజార్ పేరు గుర్తుకు వస్తే, ఎస్వీరంగారావు, వివాహభోజనంబు పాట గుర్తుకు రావాల్సిందే. ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద హోటళ్లలో ఆ పాట క్లిప్పింగ్ స్టిల్స్ భారీ సైజులో కనిపిస్తుంటాయి. ఇప్పడు ఈ మ్యాజిక్ సాంగ్ ను రిపీట్ చేయాలని భావిస్తోందట మహానటి టీమ్. బుర్రా సాయిమాధవ్ ఈ సినిమాకు రచయితగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటకు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మంచు మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ రంగారావు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల సందర్భోచితంగా ఈ పాటను సినిమాలో రిపీట్ చేసే ఆలోచనలు సాగతున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి విఎఫ్ఎక్స్ సాంకేతిక సదుపాయాలు లేని రోజుల్లో మార్కస్ బార్ట్లే చిత్రీకరించిన అద్భుుతం అది.

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సదుపాయాన్ని, మోహన్ బాబు లాంటి నటుడుని వాడుకుంటే, ఆ పాట మరింత అద్భుతంగా వుంటుంది. కానీ ఒక్కటే రీమిక్స్ పేరిట పాట ట్యూన్ ను ఖూనీ చేయకుండా వుండాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?