Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మార్చ్ కోసం సినిమాల మార్చ్

మార్చ్ కోసం సినిమాల మార్చ్

సినిమాల విడుదలకు బ్రేక్ పడే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అంటే మరేం లేదు. ఎగ్జామ్స్ సీజన్ వచ్చేస్తే కాస్త బ్రేక్ పడుతుంది సినిమాల విడుదలకు. మార్చ్ ఫస్ట్ వీక్ దాటితే ఇక పరీక్షల సందడి మొదలవుతుంది. దాదాపు నెలంతా వుంటుంది. అందుకే అడుగు బొడుగున మిగిలిన సినిమాలు అన్నీ చకచకా విడుదలకు రెడీ అయిపోతున్నాయి. ముఖ్యంగా మాంచి డేట్ గా భావిస్తున్న మార్చి మూడున విడుదల కావడానికి ఇప్పటికే మూడు సినిమాలు రుమాళ్లేసుకున్నాయి. మరో ఒకటి రెండు అయినా వస్తాయని అంచనా.

ఎప్పటి నుంచో విడుదల కోసం క్యూలో వేచి వున్న రాజ్ తరుణ్-వంశీకృష్ణ (దొంగాట) కాంబినేషన్ లోని కిట్టూ వున్నాడు జాగ్రత్త ఆ రోజునే విడుదలవుతొంది. ఇక మంచు మనోజ్ చాలా హోప్స్ పెట్టుకున్న గుంటూరోడు సినిమా కూడా ఆ రోజు కోసమే రెడీ అయింది. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్. అదే విధంగా ఎప్పుడో డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు వెయిట్ చేస్తున్న చిన్న సినిమా మెట్రో కూడా ఆ రోజే విడుదలకు ముహూర్తం పెట్టుకుంది. ఇవి కాక ఒకటి రెండు చిన్న సినిమాలు రెడీ అవుతున్నాయి.

మార్చి పది నుంచి విడుదల అంటే కాస్త ఇబ్బంది. అందుకే ఈ తొడతొక్కిడి. అయినా మార్చి పదిన కూడా విడుదలకు ఓ సినిమా రెడీ అవుతోంది. శ్రేయాస్ మీడియా నిర్మించిన వెంకటాపురం సినిమా విడుదల అప్పుడే. ఆ సినిమాలో హ్యాపీ డేస్ రాహుల్ హీరోగా నటించాడు. మొత్తం మీద సినిమాల విడుదలకు ఇంటర్వెల్ లాంటి ఈ టైమ్ లో సినిమాల హడావుడి బాగానే వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?