Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరీ అంత ఘోరమా?

మరీ అంత ఘోరమా?

శుక్రవారం విడుదలయ్యాయి. పోటా పోటీగా మూడు సినిమాలు. టాక్, కలెక్షన్లు, ఇతరత్రా వ్యవహారాలు ఎలా వున్నా, పెట్టిన డబ్బులు రాబట్టు కోవడానికి కిందా మీదా పడుతున్నాయి. అలాంటి టైమ్ లో మూడు సినిమాలు నెట్ లో ప్రత్యక్షమైపోతే. అంతకన్నా దారణం, ఘోరం మరోటి వుండదు. కానీ శుక్రవారం సినిమాలు విడుదలైతే, శనివారం రాత్రికే నెట్ లో కెమేరా ఫ్రింట్ లు ప్రత్యక్షమైపోయాయి. ఇవేమంత గొప్ప ప్రింట్ లు కావు. కానీ, సినిమాల కలెక్షన్లు దెబ్బ తీయడానికి ఈ మాత్రం చాలు.

ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లే. సి సెంటర్లలో పెద్దగా సెక్యూరిటీ వ్యవహారాలు వుండవు. పక్కవాడిని అడ్డుకునే వ్యవహారాలు అంతకన్నా వుండవు. పోనీ తీసుకున్నవాడు తీసుకున్నట్లు వుంటాడా? యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేసేయడం. ఇలాంటి వ్యవహారాలు బ్లాక్ బస్టర్ సినిమాలకు చేసే హాని కన్నా ఏవరేజ్ సినిమాలకు, బడ్జెట్ ఎక్కువ అయిన మీడియం సినిమాలకు చేసే హాని ఎక్కువ.

ఇప్పుడు నెట్ లో కాస్త ఓపిగ్గా వెదికితే, లై, జయ జానకీ నాయక, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాల కెమేరా ప్రింట్ లు దొరికేస్తున్నాయి. జనాలు మొబైళ్లలో పెట్టుకుని చూడడానికి సరిపోతున్నాయి. మరి ఇంక కలెక్షన్లు ఎలా పుంజుకుంటాయి?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?