Advertisement


Home > Movies - Movie Gossip
మరో కొత్త దర్ళకుడికి బన్నీ చాన్స్

బన్నీ డిఫరెంట్ రూట్ లో ప్రయాణిస్తున్నాడు. మిగిలిన బడా హీరోలంతా పెద్ద దర్శకులే కావాలని కిందా మీదా అవుతుంటే, బన్నీ కథ నచ్చితే చాలు కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాడు. రైటర్ గా అనుభవం వున్న వక్కంతం వంశీకి అవకాశం ఇచ్చాడు. నా పేరు సూర్య సినిమా రెడీ అవుతోంది.

ఈలోగా మరో కొత్త దర్శకుడు చెప్పిన కథ వినేసాడు. ఓకె చేసేసాడు. సంతోష్ రెడ్డి అనే కొత్త దర్శకుడు బన్నీకి కథ చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వినికిడి. అయితే ఎప్పుడు చేస్తాడు? ఏ బ్యానర్ లో చేస్తాడన్నది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు.

నా పేరు సూర్య కాస్త ఎమోషనల్ సినిమా. అందుకే ఆ సినిమా తరువాత ఓ ఎంటర్ టైన్ మెంట్ మూవీ చేయాలనుకుంటున్నాడు బన్నీ. ఆ తరువాత ఈ సంతోష్ రెడ్డి సినిమా చేసే అవకాశం వుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఆ కథ వుంటుందని తెలుస్తోంది.

కథ సరైనది పడితే చాలు, మిగిలిన ప్యాడింగ్ అంతా తాము అందివ్వగలమని బన్నీ ధైర్యం. మ్యూజిక్, ఫైట్లు, డ్యాన్స్ లు, స్టయిలింగ్ ఇలాంటివి అన్నీ బన్నీ బాగా ఇన్ వాల్వ్ అయి చేసుకుంటాడు. అందుకే స్క్రిప్ట్ సరైనది దొరికితే చాలు కొత్తవాళ్లయినా అవకాశం ఇవ్వడానికి బన్నీ రెడీ.