Home > Movies - Movie Gossip
మరోసారి తల్లి పాత్రలో మీనా

దృశ్యం సినిమాలో తల్లిగా తళక్కున మెరిసింది అలనాటి హీరోయిన్ మీనా. ఇప్పడు మళ్లీ మరోసారి అలాంటి కీలకమైన పాత్రలో నటిస్తోంది. దర్శకుడు శ్రీవాస్-హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంలో హీరో తల్లి పాత్రకు మీనాను ఏరి కోరి తీసుకున్నారు.

స్క్రిప్ట్ లో హీరో చైల్డ్ ఎపిసోడ్ కి, తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత వుంది. అందుకే మీనా లాంటి స్టార్ మదర్ అయితే బాగుంటుందని దర్శకుడు శ్రీవాస్ భావించి, ఆమెకు కథ చెప్పి ఒప్పించారట.

ఇప్పటికే ఈ చైల్డ్ ఎపిసోడ్ ను షూట్ చేసేసారు. కేవలం సినిమాలో వచ్చే హీరో చైల్డ్ ఎపిసోడ్ కే మూడు కోట్లకు ఫైగా ఖర్చు చేసారట. అంటే కథలో ఈ పార్ట్ కు వున్న ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది.

ఇదిలా వుంటే ఈ సినిమాను ఎలాగైనా చకచకా ఫినిష్ చేసి సంక్రాంతి బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. కానీ సినిమాలో విఎఫ్ఎక్స్ పనులు కూడా చాలా వున్నాయట. అందువల్ల సంక్రాంతికి రెడీ కావడం కష్టం అని తెలుస్తోంది. మార్చి వేళకు అయితే రెడీ అవుతుందని డైరక్టర్ శ్రీవాస్ భరోసా ఇస్తున్నారట.