Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మరో తమిళ దర్శకుడితో పవన్?

మరో తమిళ దర్శకుడితో పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గప్ చుప్ గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎఎమ్ రత్నం తమిళంలో నిర్మించిన వేదలమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకె చేసారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైరక్టర్ఎవరు అన్నది ఇంత వరకు ప్రకటించలేదు. విజయ్ తో జిల్లా సినిమా అందించిన నెల్సన్ అని వినికిడి.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ తమిళ దర్శకుడిని ఈ సినిమాకు డైరక్టర్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా కోసం ఆఫీస్ తీసారు.  తమిళ డైరక్టర్ ఒకరు ఈ ఆఫీసులో స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతున్నట్లు బోగట్టా. ఇప్పటికే తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య పవర్ స్టార్ తో సినిమా చేస్తున్నారు. 

త్రివిక్రమ్ తో మరో సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి రత్నం-తమిళ డైరక్టర్ సినిమా ఈ రెండింటి మధ్యలో వుంటుందో, తరువాత వుంటుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?