Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మాస్..సూర్య దెయ్యం?

మాస్..సూర్య దెయ్యం?

మాస్ అంటూ ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు తమిళ టాప్ స్టార్ సూర్య. ఇందులో అతగాడిది డబుల్ రోల్. సరోజ లాంటి వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమా, గ్యాంబ్లర్ లాంటి యాక్షన్ సినిమా అందించిన వెంకట్ ప్రభు దర్శకుడు. నయనతార, ప్రణీత కథానాయికలు.వచ్చే నెల 15న విడుదలవుతుందీ సినిమా.  

రెండు పాత్రలు అంటే ఒకటి ఎలాగూ హీరో. మరి రెండో పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు డిస్కషన్ లో వుంది. సూపర్ నాచురల్ పవర్స్ అంటే దెయ్యాలు, అతీంద్రియ శక్తులు వంటి వాటి చుట్టూ కథ తిరుగుతుందని, ఇందులో నెగిటివ్ రోల్ కూడా సూర్యానే చేసాడని అంటున్నారు? 

సూర్య ఈ సినిమాలో దెయ్యం లేదా, నెగిటివ్ ఫోర్స్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాను సూర్య పెట్టిన కొత్త కంపెనీ 2 డి ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి, వాళ్ల పాత కంపెనీ స్టూడియో గ్రీన్ నిర్మించడం విశేషం. తెలుగులో కూడా అదే రోజు వస్తుందో, మరి తరువాత విడుదల చేస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?