Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మీడియం సినిమాకే అసలు ముప్పు

మీడియం సినిమాకే అసలు ముప్పు

చిన్న సినిమాను చంపేస్తున్నారు..అన్నది చాలా కాలంగా వినిపిస్తున్నా టాక్. కానీ అసలు ముప్పు చిన్న సినిమాల కన్నా, మీడియం సినిమాకే ఎక్కువగా కనిపిస్తోంది ఇండస్ట్రీలో. మీడియం సినిమాలంటే ఎనిమిది నుంచి పది కోట్ల రేంజ్ లో ఖర్చయ్యే సినిమాలన్నమాట. చిన్న సినిమా కోటిన్నర నుంచి మూడు, నాలుగు కోట్ల వరకు ఖర్చయితే రికవరీ కనీసం ఏదో రూపంలో ఫిఫ్టీ పర్సంట్ అయినా వుంటుంది. అయితే కలెక్షన్లో, లేదా శాటిలైట్ నో..మహా అయితే రిస్క్ కొటి నుంచి రెండు కోట్ల వరకు వుంటుంది.

కానీ ఈ మీడియం సినిమాలకు వచ్చేసరికి దాదాపు అయిదారు కోట్ల నుంచి పది కోట్ల వరకు రిస్క్ కనిపిస్తోంది. సినిమా ఓ రేంజ్ లో వుండి, సదరు హీరోకు మార్కెట్ వుండి, ఆడితే ఫరవాలేదు..కనీసం మరీ లాభాలు రాకున్నా కోటి,రెండు కోట్లు మిగుల్చుకోవచ్చు. లేదా బరాబర్ సరిపోవచ్చు. కానీ తేడా వస్తే మాత్రం.. మొత్తం పెట్టుబడి హుష్ కాకి అయిపోతోంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే..మీడియం రేంజ్ హీరో మీద అంత ఖర్చు చేయడం అన్నది ఫస్ట్ తప్పిదంగా కనిపిస్తోంది. అలా ఖర్చుచేసి, సినిమా తయారు చేసి, అమ్మకానికి పెడితే, కొనేవాళ్లు కరువు అవుతున్నారు. కారణం ఈ మిడిల్ రేంజ్ హీరోల మీద పది కోట్లు పెట్టి, దానికి తగ్గట్లు ఏరియా రేట్లు ఫిక్స్ చేస్తే కొనేవాళ్లు రావడం లేదు. దాంతో స్వంతంగా విడుదల చేయక తప్పడం లేదు.. అలాంటి పరిస్థితుల్లో సినిమా తేడా వస్తే, మొత్తం కూడా పోస్టర్ కు రాసిన మైదా పిండి అయిపోతోంది.

ఇక్కడ నిర్మాతల తప్పు కూడా వుంది. యాభై, అరవై లక్షల రెమ్యూనిరేషన్ వున్న హీరో మీద ఏడు నుంచి పది కోట్లు ఎందుకు ఖర్చుచేయాలి? వీలయినంత ఎకానమీగా వెళ్తే, అయిదు కోట్లలో ఫినిష్ చేయాల్సిన ప్రాజెక్టులకు పది కోట్లు అయిపోతోంది. నాగశౌర్యతో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమా వచ్చింది. ఆరేడు కోట్లు ఖర్చు చేసారు. రూపాయి రిటర్న లేదు. నిఖల్ తో శంకరాభరణం చేసారు. ఏడు కోట్ల వరకు ఖర్చయింది. గుడ్డిలో మెల్ల అన్నట్లు రికవరీ అలా అలా ఫరవాలేదనిపించింది.

రాజ్ తరుణ్ సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు.. నిర్మాతలు కొంతవరకు ఓకె.. బయ్యర్లు అవుట్.. స్పీడున్నోడు.. బిజినెస్ జరిగింది. బయ్యర్లు అవుట్.. గరమ్ ఓన్ గా పంపిణీ చేసారు.. ఆల్ మోస్ట్ లాస్.. దిల్ రాజు కృష్ణాష్టమికి కూడా ఇదే పరిస్థితి. నారా రోహిత్ తుంటరి.. సందీప్ కిషన్ రన్ కూడా నో రిటర్న్ లు.. అయితే నిర్మాత లేకుంటే బయ్యర్లు. 

మంచు మనోజ్ తో శౌర్య సినిమా తీసారు.. ఎనిమిది కోట్లకు పైగానే ఖర్చు.. మొత్తం నష్టమే అని టాలీవుడ్ టాక్. నారా రోహిత్ రాజా చేయి వేస్తే కు పది కోట్లు వరకు ఖర్చయిందని వినికిడి. ఇప్పుడు ఏ మాత్రం రికవరీ వుంటుందో చూడాలి.

ఖర్చు జోరు

సినిమాకు పబ్లిసిటీ కాస్ట్ లీ అయిపోయింది. మరోపక్క హీరోల వ్యవహారం అలాగే వుంది. అల్లు అర్జున్.. ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలకు సినిమాకు పాతిక లక్షల వరకు కాస్ట్యూమ్స్ అవుతున్నాయి. ఈ మీడియం హీరోలకు అంతే ఖర్చు చేయాల్సి వస్తోంది. వాళ్లకు భాస్కర్ లాంటి పెద్ద డిజైనర్ కావాలి.. వీళ్లకూ అంతే. వీళ్లకు ఇచ్చేది యాభై అరవై లక్షలు.. డ్రెస్ లకు ఇరవై లక్షలు..

ఇక అసిస్టెంట్లు, క్యారవాన్లు, ఇతరత్రా వ్యవహారాలు కూడా పెద్ద హీరోల మాదిరిగానే వుంటున్నాయి ఈ మిడిల్ రేంజ్ హీరోలకు కూడా. లీడర్ సినిమాకు రానా కోసం హెయిర్ డ్రెసేర్ కే లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని వినికిడి. ఆ సినిమా తరువాత అన్నేళ్లపాటు సినిమాలు తీసిన ఎవిఎమ్ సంస్థ మరి సినిమాలు తీయడం ఆపేసింది. అంత పాఠం నేర్పిందా సినిమా.

మిడిల్ సినిమాలకు కూడా ఒక పాటో రెండుపాటలో విదేశాల్లో అంటున్నారు. అవుట్ డొర్ లో లోకేషన్ అడ్జస్ట్ చేసుకోవడంలేదు. భారీగా సెట్ అంటున్నారు. ఇలా రెమ్యూనిరేషన్లు, పబ్లిసిటీ, ప్రొడక్షన్ అన్నీ కలిపి ఎనిమిది కోట్లకు డేకేస్తున్నాయి. కానీ ఆ హీరోల మార్కెట్ అంత వుండడం లేదు..అక్కడే సమస్య వస్తోంది.

నాగశౌర్యతొ నాలుగున్నర అయిదులో కళ్యాణ వైభోగమే తీసినా, సినిమా బాగుందని టాక్ వచ్చినా, మంచి రివ్యూలు వచ్చినా రికవరీ రెండున్నర మూడు మించలేదు. శాటిలైట్ రెండు పాతిక వచ్చింది కాబట్టి సేఫ్ అయ్యారు.

అయిదు దాటితే కష్టమే

మిడిల్ హీరోల సినిమా ఖర్చు అయిదు దాటితే అరిష్టమే. అయిదు అయితే, అదృష్టం బాగుండి సగం శాటిలైట్ సగం సేల్స్ తో గట్టెక్కేయచ్చు. లేదంటే అక్కడా కష్టం. అదే పదికి వెళ్లిపోతే ప్రమాదం అంచులకు వెళ్లినట్లే..నిర్మాతలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వుండడం చాలా అవసరం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?