Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాఫ్యామిలీతో దాసరి ఢీ

మెగాఫ్యామిలీతో దాసరి ఢీ

ఒకప్పుడు దాసరి, మెగాస్టార్ మహా మిత్రులే. తరువాతే ఏం తేడా వచ్చిందో. అలాగే మోహన్ బాబు, చిరంజీవి మాంచిదోస్తులే. కానీ మధ్యలోనే చిన్న తేడా వచ్చింది. ఇప్పుడు ఈ ఉప్పు..నిప్పులు మళ్లీ ఢీకొంటున్నాయి పరోక్షంగా. నవంబర్ 14న ఈ గ్రూప్ లకు చెందిన సినిమాలు విడుదలవుతున్నాయి. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' 14న విడుదలవుతోంది.  హీరోగా అతగాడి తొలిసినిమా అది. 

అదే రోజు దాసరి నారాయణరావు చాలా కాలం తరువాత దర్శకత్వం వహిస్తూ,నటించిన ఎర్రబస్సు కూడా విడుదలవుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. తమిళంలో హిట్టయిన సినిమాకు రీమేక్ ఇది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అని ఢీకొంటున్నాయి..చూడాలి ఫలితాలు ఎలా వుంటాయో ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?