Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా ఫైట్ పక్కా అంట

మెగా ఫైట్ పక్కా అంట

ఎవ్వరూ వెనక్కు తగ్గడం లేదు. మెగా క్యాంప్ కు చెందిన ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల చేస్తామంటూ భీష్మించుకున్నారు. సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ సినిమాలు ఫిబ్రవరి 9నే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

సాయిధరమ్ తేజ-వివి వినాయక్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న ఇంటిలెజెంట్ సినిమాను ఫిబ్రవరి 9నే విడుదల చేస్తున్నట్లు నిర్మాత కళ్యాణ్ చెబుతున్నారు.

'రెండు సినిమాలు విడుదలైతే ఏమీ అయిపోదు, పైగా జోనర్లు వేరు. అది లవ్ సబ్జెక్ట్, ఇది ఎంటర్ టైన్ మెంట్. అందువల్ల ఎవరి సినిమా వారిది' అని కళ్యాణ్ అంటున్నారు.

'ఆ సినిమా సంగతి మనకు తెలియదు. మన సినిమా 9న విడుదల అని ఎప్పుడో చెప్పాం. అలాగే వెళ్తున్నాం' అంటున్నారు వరుణ్ తేజతో తొలిప్రేమ సినిమాను నిర్మిస్తున్న బోగవిల్లి ప్రసాద్.

అయితే ఫిబ్రవరి 9అంటే ఇంకా ఇరవై రోజుల దూరంలో వుంది కాబట్టి, ఈ లోగా ఏమైనా డిస్కషన్లు జరిగి సయోధ్యలు కుదురుతాయోమో చూడాలి. లేదూ అంటే మెగా సినిమాలు రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ, అదే సమయంలో విడుదలవతున్న నిఖిల్ కిర్రాక్ పార్టీ, సీనియర్ హీరో మోహన్ బాబు గాయత్రి సినిమాలతో పోటీ పడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?