Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా హీరోలు కరుణించట్లేదు

మెగా హీరోలు కరుణించట్లేదు

ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకి రెండుసార్లు హిట్టిచ్చిన క్రెడిట్‌ దక్కించుకున్నా కానీ డైరెక్టర్‌ బోయపాటి శీను ఫేట్‌ ఏమీ మారలేదు. ఇప్పటికీ తన తదుపరి చిత్రం ఏమిటనేది ఫిక్స్‌ కాలేదు. లెజెండ్‌ రిలీజ్‌ కాకముందే రామ్‌ చరణ్‌తో ఓ సినిమా ఓకే అయినా కానీ అది తర్వాత కాన్సిల్‌ అయింది. చరణ్‌ ఇప్పుడు మాస్‌ మసాలా సినిమాలకి బ్రేకివ్వడంతో బోయపాటి వెయిట్‌ చేయక తప్పలేదు. 

ఈలోగా చిరంజీవి 150వ చిత్రం కోసం బోయపాటి శ్రీను కొన్ని కథలు సిద్ధం చేసాడు. వాటిలో ఒకదానికి చిరంజీవి, చరణ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందని కూడా వార్తలొచ్చాయి. అయితే ఆ చిత్రం ఉంటుందో లేదో అనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికీ చిరంజీవి 150వ చిత్రం కోసం డైరెక్టర్ల మధ్య మ్యూజికల్‌ ఛెయిర్‌ కాంపిటీషన్‌ జరుగుతూనే ఉంది. 

తాజాగా అల్లు అర్జున్‌తో బోయపాటి శ్రీను ఒక సినిమా చేస్తాడని టాక్‌ మొదలైంది. అల్లు అర్జున్‌ ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అన్నా కానీ అది సెట్స్‌ మీదకి వెళ్లడానికి ఏడాది పైగానే పడుతుంది. ఆల్రెడీ తనకి రెండు సినిమాలు క్యూలో రెడీగా ఉన్నాయి. వాటి కంటే ముందు బోయపాటి చిత్రం స్టార్ట్‌ అయ్యే ఛాన్స్‌ అయితే లేదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?