Home > Movies - Movie Gossip
మెగా హీరోలు-మిలటరీ పాత్రలు

ఈ మధ్యలో మళయాల సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మిలటరీ లెఫ్టినెంట్ పాత్రను పోషించాడు 1971 సినిమాలో. సరే, ఆ సినిమా అక్కడ బకెట్ తన్నేసింది. అది వేరే సంగతి. అయితే ఇప్పుడు శిరీష్ అన్న బన్నీ కూడా మిలటరీ రోల్ ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వక్కంతం వంశీ డైరక్షన్ లో చేయబోయే సినిమాలో హీరో క్యారెక్టర్ కు కొంత మిలటరీ నేపథ్యం వుంటుందని తెలుస్తోంది. లగడపాటి శ్రీధర్ నిర్మించే ఈ సినిమాను నాగబాబు సమర్పిస్తున్న  సంగతి తెలిసిందే. 

ఇదిలా వుంటే ఇప్పటికే మిలటరీ క్యారెక్టర్ అవునో కాదో కానీ, సాయి ధరమ్ తేజ కూడా జవాన్ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రతి ఇంటికి ఒకడుంటాడు అన్నది ఆ సినిమా ట్యాగ్ లైన్. వరుణ్ తేజ అయితే ఆల్రెడీ కంచె సినిమాలో మిలటరీ సోల్జర్ గా నటించి మెప్పించాడు. మొత్తం మీద మిలటరీ పాత్రలు అంటే మెగా హీరోలకు కాస్త ఇష్టమే. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ట్రయ్ చేసారు. బన్నీ కూడా ఆ మధ్య ఓ సినిమాలో మిలటరీ యూనిఫారమ్ లో తళుక్కున మెరిసాడు.