Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టారూ.. ఇదేం తీరు

మెగాస్టారూ.. ఇదేం తీరు

ఎంతటి మెగాస్టార్ అయినా కొన్ని మొగమాటాలు తప్పవు. ఎవరైనా ఏదో సినిమా చేస్తే, తప్పనిసరి విసెష్ చెబుతూ వుండాలి అప్పుడప్పుడు. అయితే అలాంటపుడు ఏదో మొక్కుబడి విసెష్ చెప్పాలి కానీ, మరీ ఇన్ వాల్వ్ అయిపోకూడదు. తాము విసెష్ చెప్పే మనిషే కాదు, వాళ్లు చేసే సినిమా ఏంటన్నది కూడా చూసుకోవాలి. లేదంటే అంత బా.. గోదు.

మెగాస్టార్ చిరంజీవి నిన్న ఓ విడియో బైట్ వదిలారు. తనతో 150వ సినిమా నటించిన రత్తాలు కోసం. అదే రాయ్ లక్ష్మీ కోసం. ఆమె నటించిన జూలీ2 సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి విసెష్ తెలిపారు. ఏదో ఒక ట్వీట్ చేసి వుండే సరిపోయేది.

కానీ ఓ అరనిమిషం విడియో బైట్ నే వదిలారు. రాయ్ లక్ష్మీ హిందీలో తొలిసారి సినిమా చేస్తున్నావ్. అది కూడా నీ యాభయ్యవ సినిమా. నువ్విలా పలు భాషల్లో సినిమాలు చేయడం ఆనందంగా వుంది. జూలీ 2నీ సత్తాను పూర్తిగా చూపించేందుకు అవకాశం వున్న సినిమా. జూలీ 2కి నా అన్నివిధాల అభినందనలు అని చెప్పడమే కాకుండా, చివర్న ఓ ఫ్లయింగ్ కిస్ కూడా విసిరారు.

ఇది చూసి మెగాభిమానులు పైకి ఏమీ అనకున్నా, ఏదో ఓ ట్వీట్ చేస్తే సరిపోదా? ఇలాంటి సినిమాకు ఇంత విడియో బైట్ ఇవ్వడం కాస్త ఓవర్ అనిపిస్తోందని తమలో తాము కామెంట్ లు చేసుకుంటున్నారు. వారి ఫీలింగ్ లో వాస్తవం వుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో చిరంజీవి స్టేటస్ వేరు. అలాంటి వాళ్లు ఇలాంటివి చేస్తే కాస్త ఓవర్ అనుకుంటారు జనం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?