Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగా స్టోరీ దొరికిందట

మెగా స్టోరీ దొరికిందట

అఖిల్ సినిమా కోసం డైరక్టర్ ను ఎంతలా గాలించారో, కథ కోసం కూడా అంతమాదిరిగానే గాలించారు. ఆఖరికి వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన లైన్ ఓకె అయింది. దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మార్చారు. కాస్త ఫాంటసీ టచ్ వున్న ఈ కథ కేవలం హీరో అఖిల్ కే కాదు, అందులో నటించబోయే హీరోయిన్ కు కూడా అంత పేరు తెస్తుందట.

ఒక్క మాటలో చెప్పాలంటే జగదేకవీరుడు-అతిలోక సుందరిలో చిరు తో సమానంగా శ్రీదేవికి ఎంత పేరు తెచ్చిందో, ఆ మాదిరిగా వుంటుందట. మనం కథను ముందుగానే దర్శకేంద్రుడితో షేర్ చేసుకుని, ఆయన అభిప్రాయం తీసుకున్నట్లే, ఈ కథను కూడా నాగ్, దర్శకుడు రాఘవేంద్రరావుతో డిస్కస్ చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. మాస్ పల్స్ తెలిసిన ఆయన సూచించిన చిన్న చిన్న సవరణల మీదటే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిందని టాలీవుడ్ టాక్. 

ఏమైతేనేం...నాగ్ తన  పెద్ద కొడుకు చైతన్య మొదటి సినిమాలో ఏ జాగ్రత్తలు మిస్ అయ్యాడో, ఇప్పుడు అవన్నీ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. లక్కీ అఖిల్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?