Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్‌ - మెగా లీక్స్‌

మెగాస్టార్‌ - మెగా లీక్స్‌

చిరంజీవి హీరోగా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' పేరుతో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం విదితమే. రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించనున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు రానుంది. టైటిల్‌ కూడా ఈ మధ్యనే రిజిస్టర్‌ చేయించేశారు. ఇంకోపక్క, సినిమాలో చిరంజీవి గెటప్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా 'స్కెచ్‌లు', డిజైన్లు దర్శనమిస్తున్నాయి. 

'గౌతమి పుత్ర శాతకర్ణి' విషయంలోనూ ఇలాగే జరిగింది. సోషల్‌ మీడియాలో వచ్చిన కొన్ని డిజైన్లను ఆ చిత్ర యూనిట్‌ కొంతమేర పరిగణనలోకి తీసుకుంది కూడా. మరి, చిరంజీవి విషయంలోనూ అదే జరుగుతుందా.? అసలంటూ, ఈ డిజైన్లు మెగా కాంపౌండ్‌ నుంచే లీక్‌ అవుతున్నాయా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. 

ఈ మధ్యనే చిరంజీవి - సురేందర్‌రెడ్డి మధ్య 'కథా చర్చలు' ఫైనల్‌ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. అయినాసరే, సినిమాకి సంబంధించి ఏ చిన్న న్యూస్‌ కూడా ఇప్పటిదాకా అధికారికంగా బయటకు రాలేదు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వుంటారనే ప్రచారం జరుగుతోంది. జీవిత చరిత్రకు కొంత కమర్షియల్‌ టచ్‌ ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇంకా చాలా గాసిప్స్‌ తెరపైకొస్తూనే వున్నాయి. వీటిల్లో కొన్ని 'మెగా లీక్స్‌' కావొచ్చని సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తుండడం గమనార్హం. 

అన్నట్టు, ఈ నెలాఖరులోగానే 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'పై నిర్మాతగా చరణ్‌ క్లారిటీ ఇవ్వబోతున్నాడన్నది తాజా ఖబర్‌. ఇది నమ్మొచ్చా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?