Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్‌తో ఈ సారి ఛాన్స్‌ మిస్సవడట.!

మెగాస్టార్‌తో ఈ సారి ఛాన్స్‌ మిస్సవడట.!

చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా కోసం చాలా చాలా అనుకున్నారు. అందులో కొన్ని కుదరలేదనుకోండి.. అది వేరే విషయం. అలా అనుకున్నవాటిల్లో, సినీ ప్రముఖుల్లో కొందరితో ఓ పాటలో చిరంజీవితో డాన్స్‌ చేయించాలనుకున్నాడు నిర్మాత రామ్‌చరణ్‌. అయితే, ఓ పాటలో తండ్రితో కలిసి చరణ్‌ డాన్స్‌ చేయడం మినహా.. చరణ్‌ అనుకున్నట్లుగా, అదనపు గ్లామర్‌ తోడవలేదు. అఫ్ కోర్స్ అవేవీ లేకపోయినా, హీరోగా చిరంజీవి రీ-ఎంట్రీ ’ఖైదీ నెంబర్ 150‘ సినిమాతో అదిరిపోయిందనుకోండి అది వేరే విషయం.

అయితే, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో సర్‌ప్రైజ్‌ ఎంట్రీ ఇద్దామనుకున్నాడట వెంకటేష్‌. తనతోపాటు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ని కూడా తీసుకొద్దామనుకున్నానని, కొన్ని కారణాలతో తన ప్లాన్స్ వర్కవుట్ అవలేదని వెంకటేష్‌ తాజాగా చెప్పుకొచ్చాడు. అదీ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్‌ షోలో. విషయం తెలుసుకున్న చిరంజీవి సర్‌ప్రైజ్‌ అయ్యారు. నిజంగానే సర్‌ప్రైజ్‌ అయ్యారా.? గేమ్‌ షోలో వుండే నాటకీయతను ఇలా డిజైన్‌ చేశారా.? అన్నది వేరే విషయం. 

ఆ సంగతి అలా వుంచితే, చిరంజీవి తదుపరి సినిమాలో ఛాన్స్‌ మిస్‌ అవకూడదని వెంకటేష్‌ అనుకుంటున్నాడన్నది తాజా ఖబర్‌. చిరంజీవి తదుపరి సినిమా అంటే అది 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! దీనికీ రామ్‌చరణే నిర్మాత. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు ఈ సినిమాకి. ఏమో, ఈ గాసిప్‌ ఎంతవరకు నిజమవుతుందోగానీ, పవన్‌కళ్యాణ్‌తో ఆల్రెడీ 'గోపాల గోపాల' సినిమాలో నటించేసిన వెంకీ, ఈసారి చిరంజీవితో కలిసి తెరపై కన్పిస్తే ఆ కిక్కే వేరప్పా.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?