Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మిస్టర్ వైట్ల.. వాట్ నెక్ట్స్

మిస్టర్ వైట్ల.. వాట్ నెక్ట్స్

మిస్టర్ సినిమాతో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఈ సినిమా తర్వాత అటు వరుణ్ తేజ్ తో పాటు ఇటు వైట్ల కూడా మీడియాకు ముఖం చాటేశారు. కానీ ఇండస్ట్రీలో హిట్స్-ఫ్లాప్స్ సహజం. ఈ విషయం వరుణ్ తేజ్ కంటే వైట్లకు బాగా తెలుసు. మరి ఈ దర్శకుడు మీడియా ముందుకు ఎప్పుడొస్తున్నాడు..? నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు..?

ప్రస్తుతానికైతే శ్రీనువైట్ల కొన్ని కథలు రాసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. వాస్తు బాగాలేదని ఈ మధ్య ఇల్లు కూడా మార్చేశాడు. మళ్లీ తన పాత ఇంట్లోకే వచ్చేశాడట. దూకుడు టైమ్ లో ఆ పాత ఇంట్లోనే ఉన్నాడట వైట్ల. వాస్తు అయితే బాగానే చూసుకున్నాడు కానీ, హీరోను చూసుకున్నాడా లేదా అనేది డౌట్.

రామ్ తో ఓ సినిమా చేస్తాడంటూ మిస్టర్ మూవీ సెట్స్ పై ఉంటుండగానే ఓ వార్త బయటకొచ్చింది. మరి రామ్ కోసం వైట్ల ఏమైనా కథ రాస్తున్నాడా..? గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో "రెడీ" సినిమా వచ్చింది. హీరో సంగతి పక్కనపెడితే వైట్ల మాత్రం కాస్త కొత్తదనం ఉండే కథలు రాస్తే బెటర్. లేదంటే ఫ్యూచర్ లో అస్సలు హీరోలు దొరకరు.

ఆగడు సినిమా ఫ్లాప్ అయినా బ్రూస్ లీతో అవకాశమిచ్చాడు చరణ్. బ్రూస్ లీ ఫ్లాప్ అయినా మిస్టర్ మూవీ ఛాన్స్ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఈసారి ఇంకో ఫ్లాప్ వస్తే మాత్రం మరో హీరో అలా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తాడనే గ్యారెంటీ లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?