Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మోక్షజ్ఞ ఎక్కడ?

మోక్షజ్ఞ ఎక్కడ?

నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు తెరపైకి వస్తాడా? అని ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. 2017లో వస్తాడని 2016లో అనుకున్నారు. 2018లో వుంటుందని మొన్నటిదాకా అనుకున్నారు. కానీ 2019 దాకా మోక్షజ్ఞ సినిమా వుండే అవకాశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే మోక్షజ్ఞ ప్రస్తుతం ఇండియాలో లేరట. విదేశాల్లో వున్నారు. ఎక్కడ వున్నారన్నది కూడా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు అని తెలుస్తోంది. విదేశాల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని, బాడీ ఫిట్ గా వుండడానికి ట్రయినీతో జిమ్ చేస్తున్నాడని అంటున్నారు. 

అలాకాదని, అన్ని విధాలా ఫిట్ గా వుండడానికి ఏదో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. యంగ్ బాయ్ అయిన మోక్షజ్ఞకు ట్రీట్ మెంట్ ల అవసరం ఏమీ వుండదు. అయితే గియితే బాడీ షేపప్ కావడానికి స్క్రిక్ట్ డయిట్ మీద వుండడమో, ఈ మధ్య ప్రతి సెలబ్రిటీ ఆర్నెల్లకు ఓసారి తీసుకుంటున్న డీటాక్సినేషన్ లాంటి ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ నో కావచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.

మొత్తం మీద విదేశాల్లో వుండి, ఫిట్ గా తయారై వెనక్కు వచ్చే మోక్షజ్ఞకు సినిమా మాత్రం ఇప్పట్లో రెడీగా వుండే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ అయిన తరువాతే మోక్షజ్ఞ ఎంట్రీ వుండే అవకాశం వుంది. పైగా అప్పుడు ఎన్నికల సమయం కూడా వుంటుంది. మరోపక్క ఎన్నికల నాటికి బోయపాటి-బాలయ్య సినిమా కూడా రెడీ చేయాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. 

వీటన్నంటి మధ్య మోక్షజ్ఞ సినిమా 2019 నాటికే రెడీ అవుతుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?